మీ సంబంధాలపై వాస్తు ఏవిధంగా ప్రభావం చూపుతుంది?

సరళ వాస్తు అందించే మానవ సంబంధాల కొరకు వాస్తు ప్రత్యేకమైనది. గురూజీ ద్వారా అనేక సంవత్సరాలపాటు పరిశోధించి అందించిన ఒక శాస్త్రీయ వాస్తు పరిష్కారం. ఇల్లు, కార్యాలయం మరియు వ్యాపారం చేసే ప్రాంతాల్లోని శక్తి కుటుంబసభ్యులు, ఆఫీసు సహోద్యోగులు లేదా వ్యాపార భాగస్వాములపై ప్రభావం చూపుతుంది.
మన సంప్రదాయ కుటుంబాల్లో మానవ సంబంధాలకు పెద్ద పీట వేస్తారు. భార్యభర్తలు, తోబుట్టువులు, అత్తామామలు, దగ్గర బంధువులు, పొరుగువారి యొక్క విభిన్న ప్రవర్తనల వల్ల ఈ మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఎంతో పవిత్రంగా భావించే భార్యాభర్తల సంబంధాలు సైతం దెబ్బతింటున్నాయి దీని ఫలితంగా విడాకులు, వేరుగా జీవించడం, పిల్లల పెంపకం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

మానవ సంబంధాలకు సంబంధించి వాస్తు యొక్క ప్రాముక్యత

ప్రతి ఇల్లు మరియు కార్యాలయం లో ‘ ఒక సంబంధ స్థానం’ ఉంటుంది. కొన్నిసార్లు ఇల్లు లేదా ఆఫీసులో సంబంధ స్థానం ఉండకపోవచ్చు. ఇంటిలో సంబంధ స్థానం ఉన్నప్పటికీ కూడా, బాత్రూమ్, టాయిలెట్ మరియు యుటిలిటీ గదుల వల్ల అది అడ్డగించబడి ఉండవచ్చు. దీనితో కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలవుతుంది.
వంటగది వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే, అది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై ప్రభావం కనపరుస్తుంది.
లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్‌లో రౌద్రంగా ఉన్న దేవతా పటాలను ఉంచడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఊహించని తగాదాలు తగ్గిపోతాయి.

కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఉండే సప్తచక్రాల దిశను అనుసరించినట్లయితే, అది సంబంధాల్లో సమస్యలను సృష్టిస్తుంది. ప్రేమాభిమానాలు లోపిస్తాయి.
భార్యభర్తల మధ్య చిన్నచిన్న విషయాలకు సైతం తగాదాలు ఏర్పడి, అవి మరింత తీవ్రమై విడాకులు, వేరుపడటానికి దారితీయవచ్చు.
తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య తరచుగా అభిప్రాయ బేధాల కారణంగా, కుటుంబంలో శాంతి, మానసిక ప్రశాంతత లోపిస్తాయి.
పొరుగువారు, తోబుట్టువులు మరియు బంధువుల మధ్య ఊహించని తగాదాలు ఏర్పడతాయి, ఇది కుటుంబ గౌరవమర్యాదలపై ప్రభావం పడుతుంది, సమాజంలో పేరు చెడిపోతుంది.
కార్యాలయంలో సైతం వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు ఏర్పడతాయి.

మానవ సంబంధాలు పునరుద్ధరించడానికి సరళవాస్తు సహాయపడుతుంది.

నిర్మాణపరమైన మార్పులు చేయకుండానే ఇల్లు లేదా పని ప్రాంతంలో మానవ సంబంధాల పరంగా ఏర్పడ్డ చికాకులకు సరళ వాస్తు ఒక పరిష్కారాన్ని అందిస్తుంది.
కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి, అన్యోన్యత పెంపొందడానికి సరళ వాస్తు, ‘ అత్యుత్తమ సంబంధాల దిశ’ మరియు ‘అత్యుత్తమ నిద్ర దిశ’ని అందిస్తుంది. సప్త చక్రాలు శక్తివంతం కావడం వల్ల కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి.
కుటుంబంలో సానుకూల ప్రభావాలు గణనీయంగా వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉండే చిత్రాలను గోడలపై వేలాడదీయాలని సరళ వాస్తు సూచిస్తోంది.