
బాత్రూమ్, టాయిలెట్ లేదా సామానుల గది పక్కన కాకుండా ఎక్కడైనా పూజ గది ఉండవచ్చు. బహుళ అంతస్థుల భవంతిలో బాత్రూమ్లు మరియు టాయిలెట్లకు దిగువ ఉండరాదు. పూజగదిలోని దీపాలు, పువ్వులు, కర్పూరం మరియు అగరవత్తుల వెలిగించి, మంత్రోచ్ఛారణ చేయడం వల్ల పూజ గది నుంచి సానుకూల శక్తి వెలువడుతుంది.
పూజగదులు టాయిలెట్ లేదా బాత్రూమ్ పక్కన ఉన్నట్లయితే, ఇవి వ్యతిరేక శక్తిని ఉత్పత్తి చేస్తాయి, తద్వారా ఇంటిలో సంతులనం లేకుండా చేస్తాయి. అందువల్ల ఇంటిలో సానుకూల శక్తి ఏర్పడే మార్గాల గురించి ప్రతిఒక్కరూ స్పష్టంగా తెలుసుకోవాలి. సరళవాస్తు ఈ సమస్యకు ఎంతో సరళమైన మరియు శాస్త్రీయ పరిష్కారాన్ని అందిస్తుంది.