vastu-for-marriage
మీ వివాహంపై వాస్తు ఏవిధంగా ప్రభావం చూపుతుంది?

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన దశ. సంప్రదాయ కుటుంబ నిర్మాణంలో అందరూ గృహస్థు ధర్మాన్ని పాటించడం ద్వారా వైవాహిక జీవిత ఆనందాన్ని ఆస్వాదించాలి. నేటి యువతరం ఇంటర్నెట్‌లోని వివాహ సైట్‌లు, సోషల్ మీడియా సైట్‌లు, వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌ల్లో ప్రచురించే ప్రకటన ద్వారా పెళ్లి సంబంధాలను వెతుక్కునేందుకు ఆసక్తి చూపిస్తోంది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన సంబంధాలను వెతకడం కొరకు బంధువులు లేదా వివాహ కౌన్సిలర్‌ల సహాయం కూడా తీసుకుంటారు. అయితే, వాస్తు ప్రభావం వల్ల వివాహం ఆలస్యం కావడం లేదా వివాహమైన తరువాత విడిపోవడం జరుగుతుంది

వివాహం ఆలస్యం అవడం మరియు వివాహం జరగకుండా ఆగిపోవడం వంటి సమస్యలనుంచి అధికమించడానికి వివాహం కొరకు వాస్తు ప్రాముఖ్యత

ప్రతి ఇల్లు మరియు కార్యాలయానికి సంబంధ స్థానం ఉంటుంది. సంబంధ స్థానంపై టాయిలెట్ లేదా బాత్‌రూమ్ లేదా యుటిలిటీ గది ప్రభావం పడినట్లయితే, పైన వివరించిన విధంగా వివాహ సంబంధాన్ని కుదర్చడం కష్టం అవుతుంది.
లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్‌లో ఏవరైనా సాధువు లేదా అవతార మూర్తి (వివాహం కానివారు) పటాన్ని వేలాడదీసినట్లయితే, వివాహం ఆలస్యం కావడం, సంబంధాలు విచ్ఛిన్నం కావడం జరగవు. సరళ వాస్తు చిట్కాల ప్రకారం మీ బెడ్‌రూమ్‌లో వాస్తును అభివృద్ధి చేయడం ద్వారా మీ వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

పెళ్లి చూపుల సమయంలో వధువు వ్యతిరేక దిశలో కూర్చున్నట్లయితే,  పెళ్లి సంబంధం కుదరడం ఆలస్యం అవుతుంది.

కాబోయే పెళ్లికూతురు  బెడ్‌రూమ్ లేదా నిద్రించే చోటు  వ్యతిరేక దిశలో ఉంటే,  వధువుకు అనారోగ్యం కలుగుతుంది: అందవిహీనం కావడం లేదా లావు అవ్వడం జరగవచ్చు.

వధువు బాగా చదువుకొని, స్థితిమంతులైన కుటుంబానికి చెందినదై, మంచి ఉద్యోగం చేస్తూ, బయటకు ఎలాంటి తేడాలు కనిపించనప్పటికీ,  వీరిద్దరూ వైవాహిక బంధంలో ఇమిడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వధూవరుల జాతక చక్రాలు చక్కటి సరిపోయినప్పటికీ వారికి వివాహం కావడంలో తెలియని అవాంతరాలు చోటు చేసుకుంటాయి.

అనేక మంది వరులు, వధువుని చూసి, ప్రాథమికంగా సమ్మతం తెలియజేసినప్పటికీ కూడా తుది నిర్ణయానికి రాలేకపోతారు, ఊహించని కారణాల వల్ల వారి వివాహం వాయిదా పడుతుంది, దీనివల్ల వధువు కుటుంబసభ్యులు ఆందోళన చెందుతారు.

సంబంధాన్ని కుదుర్చుకోవడంలో కట్నం వంటి విషయాలు వధువు కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెడతాయి. వివాహం నిశ్చయమైన తరువాత కూడా ఇలాంటి సమస్యల వస్తాయి.

వివాహ సంబంధిత విషయాల్లో సరళ వాస్తు ఏవిధంగా సహాయపడుతుంది?

నిర్మాణపరమైన మార్పుచేర్పులు చేయకుండానే ఇల్లు మరియు కార్యాలయంలో సానుకూల శక్తిని స్థిరీకరించి, వ్యతిరేక శక్తిని తగ్గించడం ద్వారా వివాహం కొరకు సరళవాస్తు సులభమైన వాస్తు పరిష్కారాలను అందిస్తుంది.

వివాహ సంబంధత సమస్యలకు కూడా సరళ వాస్తు పరిష్కారాలను అందిస్తుంది, వివాహం కలకాలం సాగిపోయేలా దోహదపడుతుంది.

పెళ్లిచూపుల సమయంలో వధువు ఏ దిశలో కూర్చోవాలి, వారిలో సానుకూలశక్తిని పెంపొందించే రంగులు ఏమి వంటి అనేక విషయాలపై సరళ వాస్తు సలహాలు ఇస్తుంది.

మానవ సంబంధాలకు సంబంధించి వాస్తు యొక్క ప్రాముక్యత

ప్రతి ఇల్లు మరియు కార్యాలయం లో ‘ ఒక సంబంధ స్థానం’ ఉంటుంది. కొన్నిసార్లు ఇల్లు లేదా ఆఫీసులో సంబంధ స్థానం ఉండకపోవచ్చు. ఇంటిలో సంబంధ స్థానం ఉన్నప్పటికీ కూడా, బాత్రూమ్, టాయిలెట్ మరియు యుటిలిటీ గదుల వల్ల అది అడ్డగించబడి ఉండవచ్చు. దీనితో కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలవుతుంది.

వంటగది వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే, అది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై ప్రభావం కనపరుస్తుంది.లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్‌లో రౌద్రంగా ఉన్న దేవతా పటాలను ఉంచడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఊహించని తగాదాలు తగ్గిపోతాయి.

కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఉండే సప్తచక్రాల దిశను అనుసరించినట్లయితే, అది సంబంధాల్లో సమస్యలను సృష్టిస్తుంది. ప్రేమాభిమానాలు లోపిస్తాయి.

భార్యభర్తల మధ్య చిన్నచిన్న విషయాలకు సైతం తగాదాలు ఏర్పడి, అవి మరింత తీవ్రమై విడాకులు, వేరుపడటానికి దారితీయవచ్చు.
తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య తరచుగా అభిప్రాయ బేధాల కారణంగా, కుటుంబంలో శాంతి, మానసిక ప్రశాంతత లోపిస్తాయి.

పొరుగువారు, తోబుట్టువులు మరియు బంధువుల మధ్య ఊహించని తగాదాలు ఏర్పడతాయి, ఇది కుటుంబ గౌరవమర్యాదలపై ప్రభావం పడుతుంది, సమాజంలో పేరు చెడిపోతుంది.కార్యాలయంలో సైతం వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు ఏర్పడతాయి.

మానవ సంబంధాలు పునరుద్ధరించడానికి సరళవాస్తు సహాయపడుతుంది.

నిర్మాణపరమైన మార్పులు చేయకుండానే ఇల్లు లేదా పని ప్రాంతంలో మానవ సంబంధాల పరంగా ఏర్పడ్డ చికాకులకు సరళ వాస్తు ఒక పరిష్కారాన్ని అందిస్తుంది.

కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి, అన్యోన్యత పెంపొందడానికి సరళ వాస్తు, ‘ అత్యుత్తమ సంబంధాల దిశ’ మరియు ‘అత్యుత్తమ నిద్ర దిశ’ని అందిస్తుంది. సప్త చక్రాలు శక్తివంతం కావడం వల్ల కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి.

కుటుంబంలో సానుకూల ప్రభావాలు గణనీయంగా వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉండే చిత్రాలను గోడలపై వేలాడదీయాలని సరళ వాస్తు సూచిస్తోంది.

వివాహం కొరకు వాస్తు నిర్మాణ చట్టాల మరియు నిర్మాణ నమూనాల యొక్క ఒక పురాతన భారతీయ శాస్త్రం. ఈ నమూనాలు సానుకూల శక్తిని మెరుగుపర్చుతాయి మరియు ఒక నివాసస్థలం నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి ఉద్దేశించినవి.వివాహం కొరకు వాస్తు తు చట్టాల పరమైన ఇల్లు సమరస్యత మరియు సమావృధిని ప్రోత్సహిస్తుంది. వివాహం కొరకు వాస్తు ప్రకృతి, దాని మూలకాలు మరియు శక్తిని అనుగుణంలోకి తీసుకుని ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణం మార్పులు మరియు నిర్మాణ విధానాలు అందిస్తుంది . అలా చేయడం వల్ల నివాస స్థలంలోని శక్తి పెరిగి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందం మరియు అదృష్టం ప్రజలకు లభ్యమవుతాయి.