కెరీర్ ప్రారంభించడం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. నేటి యువత వారి చదువులను పూర్తి చేసిన తరువాత, విద్యారంగంలో తాము సాధించిన మార్కులను దృష్టి పెట్టుకొని, దాని ద్వారా మంచి ఉపాధిని పొంది కుటుంబానికి బాసటగా నిలవాలని అనుకుంటారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు కావడం లేదా కుటుంబ వ్యాపారాలను నిర్వహించడానికి మొగ్గు చూపుతారు.
ప్రతి ఇల్లు లేదా పని ప్రాంతంలో కెరీర్ స్థానం ఉంటుంది. కెరీర్ స్థానంపై ప్రభావం పడినప్పుడు, కెరీర్లో సమస్యలు ఏర్పడతాయి. ఇంటి యొక్క ప్రధాన ద్వారం లేదా తలుపు వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే, అది కెరీర్ ఎదుగుదలపై గణనీయమైన ప్రభావాన్ని కనపరుస్తుంది. దీని వల్ల ఉద్యోగం రాకపోవడం, జీతం పెరగకపోవడం, ప్రమోషన్లు లేకపోవడం, మేనేజర్లు మరియు టీమ్ సభ్యులతో తగాదాలు వస్తాయి