ఇంటి కొరకు వాస్తు

సంపద, ఆరోగ్యం, కెరీర్, విద్య, వివాహం మరియు సంబంధాల విషయంలో ఇంటి యొక్క వాస్తు కీలక పాత్రను పోషిస్తుంది. మనం మన ఇంటిలో అత్యధిక సమయం గడుపుతాం, మరియు ఇంటిలో ఉండే సానుకూల శక్తి లేదా వ్యతిరేక శక్తి మీ దేహంలో ప్రతిధ్వనిస్తుంది, తద్వారా ఇది సానుకూల లేదా వ్యతిరేకమార్గంలో మీ దేహం మరియు ఆత్మపై ప్రభావం చూపుతుంది. ఇది మానసికంగా మరియు శారీరకంగా ప్రభావం చూపుతుంది మరియు సంవృద్ధికి లేదా సమస్యలకు దారితీయవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి వద్ద సానుకూల శక్తిని సృష్టించడం కొరకు ప్రతి ఒక్కరూ నిర్ధిష్ట విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

ఇంటికి ఎనిమిది దిక్కులుంటాయి, వీటిలో నాలుగు అనుకూలమైనవి మరియు నాలుగు దిక్కులు ప్రతికూలమైనవి. వ్యక్తిగతంగా (కుటుంబం యొక్క పెద్ద) కొరకు లేదా కుటుంబం మొత్తం కూడా సంతోషంగా, చక్కటి ఆరోగ్యంతో, సంపద మరియు సంవృద్ధితో జీవించడం కొరకు ఇంటిలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో సరైన అనుకూల దిక్కులు పాటించాలి.

సరళవాస్తు ఇంటిలోని సభ్యులందరికీ కూడా వారి యొక్క అనుకూల దిక్కులు మరియు అననుకూల దిక్కులతో కూడిన వాస్తు ఛార్టుని అందిస్తుంది. మా వాస్తు నిపుణులు ఇంటి పెద్ద మరియు ఇతర కుటుంబసభ్యుల వాస్తు అనుకూలతను విశ్లేషిస్తారు మరియు అంచనాను అందిస్తారు. కుటుంబ పెద్దకు ఏదైనా వాస్తు అననుకూలతలు ఉన్నట్లయితే, కుటుంబ సభ్యులకు అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇంటికి ఎలాంటి నిర్మాణపరమైన మార్పులు చేయకుండానే మా వాస్తు నిపుణులు మీకు పరిష్కారాలను అందిస్తారు.

ఆరోగ్యం కొరకు వాస్తు

ఆరోగ్య స్థలం- ఆరోగ్య స్థానం

ఒకవేళ ఇంటిలో ఆరోగ్య స్థానం అననుకూల దిశలో ఉన్నా బాత్రూమ్ లేదా టాయిలెట్ దానిపై ఉన్నట్లయితే అది వ్యక్తులు మరియు సంబంధిత కుటుంబసభ్యుల యొక్క ఆరోగ్యంపై ప్రభావాన్ని కనపరుస్తుంది.

వ్యక్తులు లేదా అతని కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యపరంగా విభిన్నరకాలైన సమస్యలను ఎదుర్కొంటుంది.

సంపద కొరకు వాస్తు

ఒకవేళ ఇంటిలో సంపద స్థానం అననుకూల దిశలో ఉన్నా బాత్రూమ్ లేదా టాయిలెట్ దానిపై ఉన్నట్లయితే అది సంపదను సృష్టిలో మరియు దానిని నిలుపుకోవడంలో అడ్డంకులను సృష్టిస్తుంది.

చదువు కొరకు వాస్తు

ఒకవేళ ఇంటిలో విద్యా స్థానం అననుకూల దిశలో ఉన్నా బాత్రూమ్ లేదా టాయిలెట్ దానిపై ఉన్నట్లయితే అది పిల్లల చదువు విషయంలో సమస్యలను సృష్టిస్తుంది.

పేరుప్రఖ్యాతలు కొరకు వాస్తు

ఇంటిలో లేదా పనిప్రాంతంలో పేరుప్రఖ్యాతుల స్థానం లేకపోయినట్లయితే, అది పేరుప్రఖ్యాతులుపై చెడు ప్రభావం కనపరుస్తుంది, దేనికోసమయితే మన జీవితకాలం అంతటా కూడా ఏదైనా సాధించాలని మనం తపన పడతాం. వ్యక్తులు తమ సృజనాత్మక మరియు ఆలోచనలను వ్యక్తీకరించేందుకు అవకాశాన్ని పొందరు.

కెరీర్ కొరకు వాస్తు

ఒకవేళ ఇంటిలో కెరీర్ స్థానం అననుకూల దిశలో ఉన్నా బాత్రూమ్ లేదా టాయిలెట్ దానిపై ఉన్నట్లయితే అది వ్యక్తుల కెరీర్ విషయంలో సమస్యల్ని సృష్టిస్తుంది.

వ్యక్తులు తమ కెరీర్కు సంబంధించిన అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు.

వివాహం కొరకు వాస్తు

ఒకవేళ ఇంటిలో సంబంధాలు మరియు వివాహ స్థానం అననుకూల దిశలో ఉన్నా బాత్రూమ్ లేదా టాయిలెట్ దానిపై ఉన్నట్లయితే అది వ్యక్తుల వివాహం మరియు సంబంధాల విషయంలో ఇబ్బందులను కలిగిస్తుంది.

సత్సంబంధముల కొరకు వాస్తు

ప్రతి ఇల్లు మరియు పనిప్రాంతానికి ‘సంబంధాల స్థానం’ ఉంటుంది. కొన్నిసార్లు ఇల్లు మరియు పనిప్రాంతంలో ‘సంబంధాల స్థానం’ ఉండకపోవచ్చు. ఒకవేళ ఇంటిలో సంబంధాల స్థానం ఉన్నట్లయితే, అప్పుడు బాత్రూమ్, టాయిలెట్ మరియు యుటిలిటీ రూమ్ల స్థానం వల్ల బ్లాక్ చేయబడుతుంది. దాని వల్ల కుటుంబసభ్యుల మధ్య సంబంధాల్లో సమస్యలు చోటు చేసుకుంటాయి.

న్యాయపరమైన సమస్యల కొరకు వాస్తు

నేటి ప్రపంచంలో క్రూరత్వం, శత్రుత్వం, భిన్నాభిప్రాయాలు, ఇతరుల పట్ల ద్వేషం లాంటి సమస్యలు రోజు ఎదురుకుంటున్నాము. ఏ మాత్రం పరిహరించలేని ఇవి ఇప్పుడు మన జీవితాల్లో ఒక ముఖ్యమైన అంగంగా మారిపోయాయి. దీని వల్ల వ్యక్తుల మానసిక ప్రశాంతత మరియు సామరస్యం దెబ్బతింటుంది. కుటుంబంలోని వారందరి పై సంబంధాల్లోనూ తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనికి బదులుగా, కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది మరియు సమాజం దృష్టిలో కుటుంబంలోని సభ్యులు రాక్షసులుగా చిత్రీకరించబడతారు.