
ఆరోగ్యం జీవితంలో ఒక ముఖ్యమైన భావన. పెద్దలు చెప్పినట్లుగా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనేది సత్యం. నేటి ఒత్తిడి ప్రపంచంలో తట్టుకుని నిలబడేందుకు అవసరమైన విజ్ఞానాన్ని పొందడానికి శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎంతో కీలకమైనది. కుటుంబసభ్యుల్లో ఏదైనా ఆరోగ్య సమస్యలున్నట్లయితే, అది కుటంబంయొక్క రోజువారీ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని కనపరుస్తుంది ఈ ఆందోళనలు మరియు ఒత్తిళ్లు, ఇల్లు లేదా కార్యాలయంలోని ప్రతి ఒక్కరి ‘మానసిక ప్రశాంతత’ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హరిస్తుంది.
ఆధునిక ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ కూడా ఉరుకులు పరుగులతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల మానవ దేహంలోని రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో బయటకు కనిపించనప్పటికీ, అంతర్గతంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.దీని వల్ల ప్రతిసారి మేము మాత్రమే అనారోగ్యం బారిన ఎందుకు పడుతున్నాం అని కుటుంబసభ్యులు తరచుగా ఆలోచిస్తుంటారు.