ఒక షాపు పేరుప్రఖ్యాతులు మరియు విజయం సాధించడం కొరకు, మంచి యాజమాన్యం మరియు వినియోగదారుల పట్ల స్నేహపూర్వక దృక్పథం ఉంటే చాలదు. సరైన నిర్మాణం మరియు విలువైన వస్తువులు (ఫర్నిచర్ మరియు ఇతరాలు) షాపులోపల సక్రమంగా అమర్చడం అనేది అవసరం. షాపుల కొరకు వాస్తుశాస్త్రం అనేది షాపులను వాస్తుకు అనుకూలంగా మారుస్తాయి, తద్వారా షాపుల్లోనికి సంపద ప్రవహించడానికి మరియు వినియోగదారుల యొక్క అనుభవం మెరుగుపరచడానికి దోహదపడుతుంది. షాపుల కొరకు వాస్తు, షాపు లేదా షోరూమ్లో ఉండే వాస్తు లోపాలను తొలగిస్తుంది, తద్వారా అమ్మకాలు పెగరుతాయి, సంపద మరియు క వినియోగదారులు పెరుగుతారు, అలానే యజమాని- వినియోగదారుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. సరైన నిర్మాణంతో పాటుగా షాపులోపల వస్తువులను సరైన పద్ధతిలో అమర్చడం ద్వారా కస్టమర్లకు ఒక చక్కటి అనుభూతి ఏర్పడుతుంది మరియు షాపు గుడ్విల్ పెరుగుతుంది.

షాపుల కొరకు ఉపయోగించే వాస్తు ఇళ్ల కొరకు ఉపయోగించే వాస్తు కంటే భిన్నమైనది. క్యాష్ కౌంటర్ మరియు ఇతర మెటీరియల్స్ యొక్క దిక్కు, దిశ, స్థానం ఆధారంగా వాస్తు నిపుణులు తగిన మార్పు చేర్పులు చేస్తారు. వాస్తును వృద్ధి చేసే మెటీరియల్స్ అందుబాటులో ఉంచుతారు, ఇవి చెడ్డ లక్షణాలను తొలగించి, వ్యాపారానికి సంవృద్ధిని తీసుకొస్తుంది. నేడు అనేకమంది ప్రజలు వాస్తు యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని, దానిని అనుసరిస్తున్నారు.

షాపు కొరకు కొన్న సాధారణ వాస్తు చిట్కాలు

  1. షాప్ యొక్క యజమాని అతని లేదా ఆమె యొక్క అత్యంత అనుకూలమైన దిక్కులో కూర్చోవాలి.
  2. షాపు లేదా షోరూమ్ యొక్క ఇంటీరియర్ ప్లాట్ దీర్ఘచతురస్రాకారంగా లేదా చతురస్రాకారంగా ఉండాలి.
  3. షాపు యొక్క ప్రధాన ద్వారం ఎలాంటి చప్పుడు చేయకూడదు మరియు ఎలాంటి చెత్తచెదారం ఉండరాదు.
  4. సంపద కొరకు వాస్తు శాస్త్రం ఆధారంగా క్యాష్ కౌంటర్ మరియు దేవతా మూర్తులను ఉంచాలి.
  5. మీ షాపులో దుమ్ముధూళి లేకుండా చేయడం ద్వారా సానుకూల శక్తి వృద్ధి చెందుతుంది మరియు క వినియోగదార్లు మొదలైన వారిని ఆకట్టుకుంటుంది.

షాపు యొక్క స్థానం, నిర్మాణం అదేవిధంగా యజమాని యొక్క వ్యక్తిత్వం ఆధారంగా షాపుల కొరకు ఇతర అనేక వాస్తు చిట్కాలున్నాయి. సరళవాస్తు వాస్తు యొక్క విధానాలతోపాటుగా షాపుల కొరకు వాస్తు సూత్రాలను సైతం పరిగణనలోకి తీసుకుంటాయి, తద్వారా షాపులు/షోరూమ్లు అదేవిధంగా యజమాని మరియు ఉద్యోగులకు పేరుప్రఖ్యాతలు, విజయం మరియు సంవృద్ధి లభించేలా చేస్తుంది.