మీ పుట్టిన రోజు ఆధారంగా అనుకూలమైన దిక్కులు, అనుకూలమైన రంగుల ఆధారంగా రూపొందించబడ్డ మీ వ్యక్తిగత వాస్తు చార్టు సరళ వాస్తు. అవసరమైన వివరాలతో ఫారాన్ని నింపిన వెంటనే, మీరు మీ వ్యక్తిగత వాస్తు ఛార్టును పొందుతారు. దీని ఉపయోగించి మీ ఇల్లు, పనిప్రాంతం లేదా మీ వ్యాపారంతో వాస్తు అనుకూలతను మీరు విశ్లేషించవచ్చు. కొత్త ఇంటిని కొనుగోలు చేయలని అనుకున్నా, ఇంటిని అద్దెకు తీసుకోవాలని అనుకున్నా, ప్రధాన ద్వారం, బాత్ రూమ్లుమరియు బెడ్రూమ్లు మొదలైన వాటి దిక్కులను పరిశీలించడం కొరకు మీ వ్యక్తిగత వాస్తు చార్టు మీతో తీసుకొని వెళ్లవచ్చు. మీ ఇల్లు లేదా ఆఫీసుకు రంగులు వేయించాలని అనుకున్నప్పుడు కూడా మీ వ్యక్తిగత వాస్తు ఛార్టు మీకు సహాయపడుతుంది, మీ అనుకూల రంగుల్లో నుంచి ప్రకాశవంతమైన రంగుల్ని మీరు ఎంచుకోవచ్చు.
మీ వ్యక్తిగత వాస్తు చార్టు పొందండి. మీ అనుకూల, వ్యతిరేక దిక్కులు మరియు రంగులు, అదృష్ట సంఖ్య, చదువు, వ్యక్తిగత సంబంధాలు మరియు ఆరోగ్య దిక్కులతో మీ ఇల్లు, పని ప్రాంతం మరియు వ్యాపారం ఎంత అనుకూలంగా ఉన్నాయో విశ్లేషించుకోండి.

ఆరోగ్యం జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. పెద్దలు చెప్పినట్లుగా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ ప్రతి ఒక్కరి విషయంలో సత్యం. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నట్లయితే, దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది మరియు రోజువారీ జీవితంపైనా తీవ్రమైన ప్రభావాన్ని కనపరుస్తుంది. ఈ ఆందోళనలు మరియు ఒత్తిళ్లు, ఇల్లు లేదా కార్యాలయంలోని ప్రతి ఒక్కరి ‘మానసిక ప్రశాంతత’ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హరిస్తుంది. తెలియని కారణాల వల్ల మన శరరీంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో ప్రజలు ఇప్పుడు అనేక రకాల రుగ్మతలతో బాధించబడుతున్నారు.
అటువంటి రుగ్మతలకు ముఖ్యమైన శాస్త్రీయ కారణం మీ ఇంటి వాస్తు.
ప్రతి ఇల్లు మరియు పనిప్రాంతంలో ఒక నిర్ధిష్ట ఆరోగ్య స్థానం ఉంటుంది, నిర్మాణపరమైన అడ్డంకులు లేదా కొత్త రూమ్లు అడ్డుకోవడం వల్ల, వ్యతిరేక శక్తి పెరిగి, వ్యక్తులపై ప్రభావం చూపుతుంది.
ఆరోగ్య స్థానాలతోపాటుగా, మీరు నిద్రించే సమయంలో మీరు వ్యతిరేక దిశలో పడుకున్నట్లయితే , మీ దేహం పూర్తిగా రీఛార్జ్ అవ్వదు, ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది.
ఇంటిలో అత్యంత ముఖ్యమైన స్థానమైన వంటగది వాస్తుకు అనుగుణం లేనట్లయితే, దాని ప్రభావం కుటుంబం మొత్తంపైనా పడుతుంది. నిర్మాణపరమైన మార్పుచేర్పులు లేకుండానే సరళ వాస్తు అటువంటి సమస్యలకు సరైన సమాధానాలను అందిస్తుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో సంపద ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. సంపద లేకుండా, సమాజంలో గౌరవం లభించదు. సంపద మన జీవితంలో అన్ని రకాల సౌకర్యాలను మరియు సమాజంలో గొప్ప హోదాను మనకు అందిస్తుంది.
ఆర్థికంగా నష్టపోయినట్లయితే , దాని ప్రభావం కుటుంబంలోని అందరిపైనా పడుతుంది. అలానే పిల్లల చదువు కోసం కన్నకలలు కూడా అడియాసలైపోతాయి. చట్టపరమైన చిరాకులు మొదలైనవి కూడా తలెత్తుతాయి, దీంతో వారు తమ విధిని, దురదృష్టాన్ని నిందిస్తుంటారు.
పెట్టుబడి నష్టపోవడం, వ్యాపార నష్టాలు, అధిక వ్యయం వంటి కారణాల ద్వారా సంపద హరించుకుపోవడానికి కూడా కారణం మీ ఇల్లు మరియు పనిప్రాంతంలో ఉండే వాస్తు మూలకారణంగా చెప్పవచ్చు. మీ కెరీర్ మరియు ఫైనాన్స్ యొక్క సంబంధిత స్థానాన్ని మరుగుదొడ్డి/సామానులు ఆక్రమించవచ్చు, అలానే ప్రధాన ద్వారం కూడా అననుకూల దిశలో ఉన్నట్లయితే, కష్టపడి పనిచేసినా కూడా ఫలితం దక్కదు. పని చేయడానికి అదేవిధంగా రాత్రి సమయంలో నిద్రించే అత్యుత్తమ దిక్కు, వారి పుట్టిన రోజుపై ఆధారపడి ఉంటుంది, ఇది సప్త చక్రాలను క్రియాత్మకం చేస్తుంది, తద్వారా వారు శక్తిసంపన్నులై, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, తద్వారా ఆర్థికపరమైన నష్టాలు తగ్గుతాయి, అలానే రాబడి పెరుగుతుంది.
నివాసిత ప్రాంతం నుంచి సుమారు 67% లబ్ధిని మిగిలిన 33% లబ్ధి పని ప్రాంతం నుంచి ఆశించబడుతుంది. అదేవిధంగా కెరీర్/ నివాసం వద్ద పనిప్రాంతం మొదలైనవి నేరుగా వివిధ చక్రాలకు అనుసంధానమై ఉంటాయి, ఇల్లు మరియు పనిప్రాంతంలో అటువంటి స్థానాలను ఇతర గదులు ఆక్రమించకుండా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ చక్రాలు శక్తివంతంగా ఉంటాయి

