మీ సృజనాత్మకతపై వాస్తు ఏవిధంగా ప్రభావం చూపుతుంది?

కొంత మందికి గొప్ప సృజనాత్మకత ఉంటుంది, వారు తమ సృజనాత్మకత ఉపయోగించి, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించాలని ఆశిస్తారు, అయితే కొన్నిసార్లు ఇది వారికి ఊహించని విధంగా నష్టాలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఇంటిలో లేదా ఆఫీసులో ఉన్నప్పటికీ కూడా, ఇదే సమస్య అతడిని వెంటాడుతుంటుంది, దీని వల్ల అతడి కుటుంబసభ్యులపైన సైతం దీని ప్రభావం పడుతుంది.

సృజనాత్మకత విషయాల్లో వాస్తు ప్రాముఖ్యత

ఒక రాజమార్గంలో మనం ముందుకు సాగడానికి సాధించాలనే తపన లేకపోవడం, ప్రేరణ లోపించడం, బద్ధకం మరియు సోమరి తనం వంటివి అడ్డంకులుగా నిలుస్తాయి. సృజనాత్మక మరియు స్ఫూర్తి లోపించడానికి దిగువ పేర్కొన్న కారణాలు ప్రభావం చూపుతాయి.
ప్రతి ఇల్లు లేదా కార్యాలయంలో ఒక సృజనాత్మక స్థానం ఉంటుంది. సృజనాత్మక స్థానంపై ప్రభావం పడినప్పుడు, అది ఆత్మవిశ్వాసం మరియు స్ఫూర్తి సంబంధిత విషయంలో సమస్యను కలిగిస్తుంది. ఇల్లు లేదా పని ప్రాంతంలో ని ప్రధాన మార్గం అనుకూల దిశలో లేనట్లయితే, బద్ధకాన్ని కలిగిస్తుంది, లక్ష్యాలను సాధించడం వాయిదా పడటం లేదా సాధించకపోవడం జరుగుతుంది.

మన ఇంటిలో లేదా పని ప్రాంతంలో సృజనాత్మక లోపించినట్లయితే, మనం జీవితకాలం సంపాదించుకునే పేరు ప్రఖ్యాతులు, మర్యాదలకు విఘాతం కలుగుతుంది.సృజనాత్మకతను మరియు ఆలోచనలను ప్రదర్శించేందుకు అవకాశాలను పొందలేకపోతారు.స్వీయ ఆసక్తి లోపిస్తుంది.తమకు ఉన్నదానితో ఆత్మసంతృప్తి పొందుతారు,ఇది దీర్ఘకాలంలో వారిని సోమరిపోతులుగా మారుస్తుంది.సృజనాత్మక లోపించడం మరియు ప్రతి పనిని కూడా వాయిదా వేయాలనే గుణం వల్ల వారి పేరుప్రఖ్యాతులు దెబ్బతింటాయి.ఆత్మవిశ్వాసం తగ్గిపోవడంతో లక్ష్యాలను సాధించలేకపోతారు, తలపెట్టిన ప్రతి పని కూడా అసంపూర్ణంగా మిగిలిపోతుది.

సృజనాత్మకతలో సరళ వాస్తు ఏవిధంగా సహాయపడుతుంది.

స్ఫూర్తిదాయక మరియు సృజన్మాతక మార్గాల్లో సాగేందుకు అవసరమైన సానుకూల ప్రభావాలను అందించే ‘ ‘సృజనాత్మక దిశ’ను సరళ వాస్తు అందిస్తుంది. ఇది మనలో సృజనాత్మక ఆలోచనలను పొందిస్తుంది.
నిర్మాణపరమైన మార్పులు చేయకుండానే, సానుకూల ప్రభావాలను కలిగించడం, వ్యతిరేక ప్రభావాలను తగ్గించడం ద్వారా  సరళ వాస్తు మనకు సహాయపడుతుంది.