సరళ్ వాస్తు.కామ్ (“సైట్”)కు స్వాగతం. సరళ్వాస్తు.కామ్ మీకు ప్రత్యేక మరియు శాస్త్రీయ వాస్తు పరిష్కారాలను అందించే ఒక వేదిక. వీటిని మీ పరిసరాలలోకి స్వీకరిస్తే, అవి మీ శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరచి, తద్వారా మీ జీవితంలోని సమస్యలను అధిగమించేందుకు సహయపడతాయి.
సైట్‌ను ఉపయోగించడానికి, మీరు ముందుగా సైట్ యొక్క సభ్యుడు/రాలుగా (“మెంబర్”) రిజిస్టర్ కావాలి. మీరు మెంబర్ అయ్యి, సరళ్వాస్తు సేవలను (“సర్వీసెస్”) పొందదలచుకుంటే, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందుగా ఉపయోగ నిబంధనలు (టెర్మ్స్ ఆఫ్ యూజ్) చదవండి. ఈ ఉపయోగ నిబంధనలు మీరు సైట్‌ను ఉపయోగించడం మరియు సంస్థ అందించే సేవలను అందుకోవడానికి సంబంధించి, మీకు మరియు సి జి పరివార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇకమీదట “కంపెనీ”, “మేము” లేదా “మా” అని ఉదహరించబడుతుంది) మధ్య ఒక చట్టబధ్ధమైన ఒప్పందంగా ఏర్పడతాయి.
రిజిస్టర్ కావడం, బ్రౌజ్ చేయడం లేదా మరే విధంగానైనా సైట్ యొక్క సౌలభ్యాన్ని పొందడం ద్వారా, మీరు ఈ ఉపయోగ నియమాలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్నారని మరియు వాటికి (“ఒప్పందం”) కట్టుబడి ఉండడానికి అంగీకరిస్తున్నారనీ మీరు తిరుగులేని విధంగా మరియు బేషరతుగా ధృవీకరించినట్లు అర్థం. మీరు ఈ ఒప్పందంలోకి ప్రవేశించడానికి మీకు హక్కు, సమ్మతి, అధికారం మరియు చట్టపరమైన సామర్థ్యం ఉన్నట్లుగా మరియు మీరు ఈ ఒప్పందంలోకి ప్రవేశించకుండా నిరోధించే, సమయంలో అమలులో ఉన్న ఎటువంటి వర్తించే చట్టం లేదా ఏదైనా న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ లేదా అటువంటి ఏ ఇతర సమర్థ అధికారి యొక్క ఆదేశం లేదా డిక్రీ లేదా ఉత్తర్వు ద్వారా మీ పై నిరోధం లేదా నిషేధం లేదని మీరు ప్రాతినిధ్యం మరియు హామీ ఇస్తున్నారు.
“మెంబర్”, “యూజర్” లేదా “మీరు” అంటే హోస్టింగ్, ప్రచురించడం, పంచుకోవడం, వ్యవహరించడం, ప్రదర్శించడం లేదా సమాచారం లేదా అభిప్రాయాలను అప్లోడ్ చేయడానికై కంపెనీ యొక్క సైట్ లోకి ప్రవేశించే లేదా ఉపయోగించుకునే వ్యక్తి మరియు కంపెనీ యొక్క సైటును ఉపయోగించడంలో కలిసి పాల్గొంటున్న ఇతర వ్యక్తులు అని అర్థం.
- అర్హత
- సైట్ యొక్క మెంబర్‌గా రిజిస్టర్ కావడానికి మరియు దాన్ని ఉపయోగించుకోవడానికి, మీరు భారతదేశ చట్టాల ప్రకారం ఒక ఒప్పందంలోకి ప్రవేశించే చట్టబద్ధమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఏ సమయంలోనైనా, ఒకవేళ మీరు మభ్యపరచినట్లు కంపెనీ కనుగొంటే, మీ సభ్యత్వాన్ని మరియు/లేదా సైటు మరియు/లేదా సేవలను ఉపయోగించుకునే మీ హక్కును ఏ రకమైన స్వభావం గల ఎటువంటి బాధ్యతలను లేకుండా నిలిపివేసే హక్కును కంపెనీ కలిగి ఉంది.
- సైట్ యొక్క సభ్యత్వం కేవలం వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది. ఇది కంపెనీలు, ఎల్.ఎల్.పి.లు, భాగస్వామ్య సంస్థలు, ఇన్స్టిట్యూషన్లు, ట్రస్టులు, సంఘాలు, వ్యక్తుల మరియు/లేదా వ్యాపార సంఘాలకు ఉద్దేశించినది కాదు.
- గడువు
- మీరు సైట్‌ను ఉపయోగించినంత కాలం లేదా మీరు సైట్ యొక్క మెంబర్‌గా ఉన్నంత కాలం ఈ ఒప్పందం పూర్తి అమలులో ఉంటుంది. మీరు కంపెనీకి వ్రాతపూర్వకంగా తెలియజేయడం ద్వారా, ఏ సమయంలోనైనా మీ సభ్యత్వాన్ని నిలిపివేసుకోవచ్చు. మీరు మీ సభ్యత్వాన్ని నిలిపివేసే సందర్భంలో, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, సందర్శన ఛార్జీలు, కన్సల్టెన్సీ ఛార్జీలు, సామగ్రి మరియు/లేదా ఇతర సౌలభ్యాలను పొందడానికి అయిన ఖర్చులు, సేవల క్రింద మీకైన మరియు/లేదా మీరు కట్టిన ఛార్జీలు, ఖర్చులు, వ్యయాలు ఏవైనా, వ్రాతపూర్వకంగా ఉల్లేఖించబడి ఉంటే తప్ప, తిరిగి పొందే హక్కు మీకు ఉండదు. కంపెనీ ఏ కారణం చేతనైనా సైట్ ఉపయోగించుకునే సౌలభ్యాన్ని మరియు/లేదా మీ సభ్యత్వాన్ని మీరు అందించిన ఈమెయిల్ చిరునామా మరియు/లేదా మీరు అందించిన నమోదిత మొబైల్ నంబరుకు ఎస్.ఎం.ఎస్. పంపించి లేదా కాల్ చేసి తెలియజేసి లేదా తెలియజేయకుండా నిలిపివేయవచ్చు.
- ఈ ఒప్పందంలో స్వాభావికంగా నిలుపుదలకు గురి కావలసిన నిబంధనలు అన్నీ ఎటువంటి పరిమితి, నిరాకరణ, నష్టపరిహారం మరియు బాధ్యత యొక్క పరిమితులు లేకుండా రద్దు చేయబడతాయి. సైట్‌ను మరియు సేవలను ఉపయోగించుకునే మీ సౌలభ్యం యొక్క నిలిపుదల ఈ నిలుపుదలకు ముందు తలెత్తిన లేదా సంభవించే బాధ్యతల నుండి మీకు విముక్తిని ఇవ్వదు.
- చెల్లింపు, ఛార్జీలు మరియు పన్నులు
- మీరు వినియోగించుకునే సేవలకు వర్తించే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, సందర్శన ఛార్జీలు మరియు కన్సల్టెన్సీ చార్జీలు మరియు ఇతర ఛార్జీలను చెల్లించడానికి ఒప్పుకుంటున్నారు మరియు మీరు చెప్పబడిన చార్జీల నిర్మాణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించరు.
- ఈ చెప్పబడిన ఛార్జీలను సైటు పై ఏర్పాటు చేసిన ఆన్లైన్ సౌలభ్యం ద్వారా లేదా సైట్లో ఇచ్చిన వివరాల ప్రకారం కంపెనీ ఖాతాకు ఆర్.టి.జి.ఎస్. లేదా నెఫ్ట్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి ఇతర పక్షాల మద్దతు మరియు సేవలు అవసరం. ఈ ఇతర పక్షాలు కంపెనీ యొక్క నియంత్రణ పరిధిలోకి రానందున, వీటిని ప్రాసెస్ చేసే సమయంలో మీకు జరిగే ఎటువంటి నష్టం లేదా డ్యామేజీలకు కంపెనీ బాధ్యత వహించదు. కంపెనీ ప్రతినిధులు మీరున్న చోటికి వచ్చినప్పుడు వారి చేతికి డబ్బును ఇవ్వడం ద్వారా ఈ ఛార్జీలను ఆఫ్‌లైన్ చెల్లింపు కూడా చేయవచ్చు.
- ఈ ఛార్జీలన్నింటిలో వర్తించే పన్నులు, సుంకాలు మరియు శిస్తులను లెక్కించి ఉండవు.
- సైట్లో పెట్టడం ద్వారా రుసుము నిర్మాణంలో మార్పు చేసే హక్కు మాకు ఉన్నది, ఇది చెల్లుబాటు అయ్యే మరియు అంగీకరించిన సంభాషణ విధానంగా పరిగణించబడుతుంది.
- చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి, మాకు మీ బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు నంబరు వంటి వివరాలు అవసరం.
- రద్దు మరియు తిరిగి చెల్లింపు విధానం
మీరు చెల్లించిన రిజిస్ట్రేషన్, సందర్శన మరియు కన్సల్టెన్సీ ఛార్జీలు తిరిగి చెల్లించబడవు. తదుపరి, మీరు సేవల కొరకు మీ అంగీకారాన్ని తెలిపి, మా ప్రతినిధి మీ ప్రాంతానికి వచ్చిన సమయంలో లేదా ఆ తరువాత మా సేవల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న పక్షంలో, మేము తెలియజేసే విధంగా సందర్శన ఛార్జీలను చెల్లించవలసిన బాధ్యత మీకు ఉంటుంది
- సమాచారం పై యాజమాన్య హక్కులు
సైట్ మరియు సేవల యొక్క యాజమాన్య హక్కులు అన్నింటినీ కంపెనీ కలిగి ఉంది. సైట్లో కాపీ రైట్ చేయబడిన సమాచారం, ట్రేడ్ మార్కులు, ఇంకా కంపెనీ మరియు దాని లైసెన్సర్ల ఇతర యాజమాన్య సమాచారం ఉంటుంది. బహిరంగ డొమైన్లో ఉన్న సమాచారం తప్ప లేదా యూజర్ అనుమతిని పొందిన వాటికి తప్ప, మిగిలిన యాజమాన్య సమాచారాన్ని మీరు కాపీ, మార్పు, ప్రచురణ, ప్రసారం, పంచడం, ఉపయోగం, ప్రదర్శన లేదా అమ్మడం చేయకూడదు. మీ ద్వారా ఇటువంటి ఏ చర్య అయినా, లేదా చర్య తీసుకునే ప్రయత్నమైనా ఈ ఒప్పందం యొక్క ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఏ ఉల్లంఘనలకైనా, వర్తించే అన్ని చోట్లా చట్టపరమైన చర్య (సివిల్ మరియు/లేదా క్రిమినల్) తీసుకునే హక్కు కంపెనీకి ఉంది.
- సైట్ పై ప్రచురించిన సమాచారం
- ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని లేదా ప్రమాదకరంగా, చట్టవిరుధ్ధంగా లేదా కంపెనీ మరియు/లేదా దాని సైట్ సభ్యుల భద్రతకు హానికరంగా లేదా ప్రమాదకరంగా లేదా హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన జాబితాలు, విషయాలు, సంభాషణ, ఫోటోలు లేదా ప్రొఫైల్స్ (అన్నీ కలిపి, “సమాచారం”)ను కంపెనీ తొలగిస్తుంది అని మీకు అవగాహన ఉంది మరియు మీరు అంగీకరిస్తున్నారు.
- మీరు అప్లోడ్, పోస్ట్, ఈమెయిల్, ప్రసారం లేదా ఏ విదంగానైనా ఈ సర్వీసు ద్వారా ఇతర సభ్యులకు అందుబాటులో ఉంచే సమాచారం, డేటా, టెక్స్ట్, ఫోటోలు, గ్రాఫిక్స్, సంభాషణలు, ట్యాగులు లేదా ఇతర కంటెంట్ మొత్తానికి మీరు వ్యక్తిగతంగా బాధ్యులని మీకు అవగాహన ఉంది మరియు అంగీకరిస్తున్నారు. సర్వీసు ద్వారా పోస్ట్ చేసిన సమాచారాన్ని కంపెనీ నియంత్రించదు, అందువల్ల, అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా నాణ్యతకు హామీ ఇవ్వదు. ఎట్టి పరిస్థితులలో, అటువంటి సమాచారానికి లేదా ఏదైనా సమాచారంలోని తప్పులు లేదా మినహాయింపులు, లేదా సర్వీసు ద్వారా ఇతర సభ్యులకు పోస్ట్, ఈమెయిల్, ప్రసారం చేసిన లేదా ఏదైనా ఇతర విధాల ద్వారా అందుబాటులో ఉంచిన అటువంటి సమాచారాన్ని ఉపయోగించడం వల్ల కలిగిన ఏదైనా నష్టం లేదా డ్యామేజీకి కంపెనీ బాధ్యత వహించదు. అయితే సైట్ పై పోస్ట్ చేయబడిన సమాచారం యొక్క విశ్వసనీయతను పరిశీలించే హక్కు కంపెనీకి ఉంది. ఈ హక్కును ఉపయోగించుకోవడంలో, మీరు సైట్ పై పోస్ట్ చేసిన సమాచారానికి మద్దతునిచ్చే డాక్యుమెంటరీ ఆధారాలను అందించమని కంపెనీ మిమ్మల్ని కోరవచ్చు. మీరు కంపెనీకీ సంతృప్తి కలిగించే విధంగా అటువంటి ఆధారాలను అందించడంలో విఫలమైన పక్షంలో, అటువంటి చర్యను ఈ ఒప్పందం మరియు కంపెనీ పట్ల ఉల్లంఘనగా పరిగణించి, మీ సభ్యత్వం ఎటువంటి తిరిగి చెల్లింపు లేకుండా రద్దు చేయబడుతుంది.
- సైట్ యొక్క ఏదైనా బహిరంగ ప్రదేశంలో సమాచారం / ప్రకటన పోస్ట్ చేయడం ద్వారా, కంపెనీకి మరియు ఇతర సభ్యులకు అటువంటి సమాచారాన్ని మరియు కంటెంట్‌ను ఉపయోగించడానికి, కాపీ చేయడానికి, నిర్వహించడానికి, ప్రదర్శించడానికి మరియు పంపిణీ చేయడానికి మరియు ఇటువంటి సమాచారం లేదా కంటెంట్ నుండి ఉత్పన్నమయ్యే రచనలు లేదా ఇతర రచనలలోకి చేర్చడానికి ఒక తిరస్కరించలేని, నిరంతర మరియు ప్రత్యేకం-కాని, పూర్తిగా చెల్లించిన, ప్రపంచవ్యాప్త లైసెన్సును మీరు స్వయంచాలకంగా మంజూరు చేస్తున్నారు మరియు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, హామీ ఇస్తున్నారు మరియు రాబోయే వాటి యొక్క ఉప-లైసెన్సులకు మంజూరు మరియు అధికారం ఇస్తున్నారు.
- చట్ట విరుధ్ధమైన లేదా సైట్ పై నిషేధించబడిన సమాచారం యొక్క సిఫార్సు చేయబడిన జాబితా ఈ క్రింద ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఇటువంటి చట్టవిరుధ్ధమైన లేదా నిషేధిత సమాచారాన్ని సైట్ పై పోస్ట్ చేస్తే, అప్పుడు కంపెనీ పరిశోధించి, దాని స్వంత విచక్షణ ప్రకారం ఆ ప్రమాదకర సంభాషణ / సమాచారాన్ని సర్వీసు నుండి తొలగించడం, మరియు తిరిగి చెల్లింపు లేకుండా మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో సహా, మరియు దానికే పరిమితం కాకుండా, మీ పై తగిన చట్టబధ్ధపరమైన చర్యను ప్రారంభిస్తుంది.
- చట్టవిరుధ్ధమైన మరియు నిషేధిత సమాచారం అంటే:
- సంఘానికి స్పష్టంగా హానికరమైన అంటే, ఏదైనా సమూహం లేదా వ్యక్తికి వ్యతిరేకంగా జాత్యహంకారం, మతవైరం, ద్వేషం లేదా ఏ రకమైన భౌతిక హానినైనా ప్రోత్సహించే ఎటువంటి సమాచారమైనా;
- ఇతర వ్యక్తిని వేధించే లేదా వేధించమని బోధించే సమాచారం;
- “జంక్ మెయిల్”, “గొలుసు ఉత్తరాలు”, లేదా అయాచిత మాస్ మెయిలింగ్ లేదా “స్పామింగ్” ప్రసారం కలిగి ఉండే సమాచారం;
- అబధ్ధమని, తప్పు దోవ పట్టించేది అని మీకు తెలిసి ఉన్న వాటిని ప్రోత్సహించే సమాచారం;
- దుర్వినియోగ పరిచే, బెదిరించే, అశ్లీలమైన, అపవాదు కలిగించే లేదా అసత్యమైన చట్టవిరుధ్ధమైన కార్యకలాపాలు లేదా ప్రవర్తనను ప్రోత్సహించే సమాచారం;
- ఇతర వ్యక్తి యొక్క కాపీ హక్కు కలిగిన రచన యొక్క అనధికారిక లేదా చట్టవిరుధ్ధమైన కాపీని ప్రోత్సహించే సమాచారం;
- పరిమిత లేదా పాస్వార్డ్ తో మాత్రమే సౌలభ్యం కలిగిన పేజీలు, లేదా దాగిన పేజీలు లేదా చిత్రాలు (చూసే సౌలభ్యం కలిగిన మరొక పేజీకి చెందని లేదా అనుసంధానించబడనివి) కలిగి ఉన్న సమాచారం;
- ఏ రకమైన పోర్నోగ్రఫీ లేదా లైంగికతను ప్రదర్శించే సమాచారం;
- 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారిని లైంగికంగా లేదా హింసాత్మకంగా దోపిడీ చేసే సమాచారాన్ని అందించే లేదా 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వారి వ్యక్తిగత సమాచారాన్ని అందించేది;
- చట్టవిరుధ్ధమైన ఆయుధాలను తయారు చేసే లేదా కొనే, ఇతరుల ప్రైవసీని ఉల్లంఘించే, లేదా కంప్యూటర్ వైరస్లు అందించే లేదా సృష్టించే అటువంటి చట్టవిరుధ్ధమైన కార్యకలాపాల గురించి సూచనా సమాచారాన్ని అందించేది;
- ఇతర యూజర్ల నుండి వాణిజ్య లేదా చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం పాస్‌వర్డులను లేదా వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని తీసుకునేది; మరియు
- పోటీలు, లాటరీలు, పరివర్తకం, ప్రకటనలు మరియు పిరమిడ్ పథకాల వంటి వాటిని మా ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేని వ్యాపార కార్యకలాపాలు మరియు / లేదా అమ్మకాలలో పాల్గొనేవి.
- మీరు సైట్లో ఈ క్రింది విధంగా ఉండే, ఏదైనా సమాచారాన్ని హోస్ట్ చేయడం, ప్రదర్శించడం, అప్లోడ్ చేయడం, సవరించడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్డేట్ చేయడం లేదా భాగస్వామ్యం చేయనని అంగీకరిస్తున్నారు:
- ఇతరులకు చెందినది మరియు దాని పై మీకు ఏ హక్కు లేనిది;
- అత్యంత ప్రమాదకరమైన, వేధించే, దైవదూషణకరమైన, పరువు నష్టం కలిగించే, అశ్లీల, పోర్న్, పెడోఫిలిక్, అసత్య, ఇతరుల గోప్యతకు హాని కలిగించే, ద్వేషపూరితమైన, లేదా జాతిపరంగా, తెగపరంగా అభ్యంతరకరమైన, అవమానకరమైన, డబ్బుల హవాలాకు సంబంధించిన లేదా ప్రోత్సహించే, లేదా ఇత్రరత్రా ఏ విధంగానైనా చట్టవిరుధ్ధమైనది;
- మైనర్లకు ఏ విధంగానైనా హాని కలిగించేది;
- ఏదైనా పేటెంట్, ట్రేడ్ మార్క్, కాపీ రైట్ లేదా ఇతర యాజమాన్య హక్కులను ఉల్లంఘించేది;
- ఆ సమయంలో అమలులో ఉన్న ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించేది;
- అటువంటి సందేశాల మూలం గురించి ఉద్దేశించబడిన వారిని మోసం లేదా తప్పుదోవ పట్టించేది లేదా అత్యంత హానికర లేదా భయంకర స్వభావం గల ఎటువంటి సమాచారాన్ని అందించడమైనా;
- మరో వ్యక్తిగా మోసం చేయడం;
- ఏదైనా కంప్యూటర్ వనరు యొక్క పనితీరును ఆటంకపరచే, నాశనం చేసే లేదా పరిమితం చేయడానికి రూపొందించిన కంప్యూటర్ కోడ్లు, ఫైల్స్ లేదా ప్రోగ్రామ్స్ లేదా సాఫ్ట్ వేర్ వైరస్లు కలిగి ఉన్నది;
- భారతదేశం యొక్క ఐకమత్యం, సమగ్రత, రక్షణ, భద్రత లేదా సార్వభౌమత్వానికి, విదేశీ ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలకు లేదా ప్రజా ఆదేశాలకు హాని కలిగించేది లేదా అపరాధ నేరాన్ని చేయడానికి ప్రేరేపించడం, లేదా ఏదైనా నేర పరిశోధనను నిరోధించడం లేదా ఇతర దేశాన్ని అవమానించడం కలిగినది;
- అన్ని వర్తించే స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర చట్టాలు, నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా మీరు సర్వీసును ఉపయోగించుకోవాలి.
- గోప్యత
సైట్ మరియు / లేదా సేవ యొక్క ఉపయోగం మా గోప్యతా విధానం (“హైపర్లింక్”) ద్వారా నిర్వహించబడుతుంది మరియు మీ గోప్యత మరియు వ్యక్తిగత డేటాను కాపాడుకోవడానికి, ఇందులో ఇవ్వబడిన నియమ నిబంధనలను పాటించండి.
- గ్రీవియెన్స్ ఆఫీసర్
ఈ ఉపయోగ ఒప్పందంలో ఏవైనా నిబంధనలను ఉల్లంఘించడం మీరు గమనించిన సందర్భంలో, మీరు వ్రాయడం ద్వారా లేదా డిజిటల్ సంతకంతో ఇమెయిల్ ద్వారా మీ ఆందోళనలను ఈ క్రింది చిరునామాలకు పంపించవచ్చు:
ఈమెయిల్: grievanceofficer@saralvaastu.com
చిరునామా: గ్రీవెయెన్స్ ఆఫీసర్,
మెసర్స్. సిజి పరివార్ ప్రైవేట్ లిమిటెడ్,
ఇ.ఎల్. 86, టిటిసి ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఎం.ఐ.డి.సి. మహాపె,
నవీ ముంబై, మహారాష్ట్ర, భారతదేశం – 400701.
గ్రీవెయన్స్ ఆఫీసర్ ఆదివారం మరియు భారతదేశంలోని ప్రజా సెలవులను మినహాయించి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల (ఐ.ఎస్.టి.) మధ్యలో అందుబాటులో ఉంటారు.
- డిస్క్లెయిమర్లు
సైట్ పై అందించిన సామగ్రి కేవలం సమాచార ప్రయోజనం కొరకే, దానిలో ఏ విషయం పైనా ఎటువంటి వైద్య సలహాలు ఉండవు. ఇందుమీదట అందించిన ఎటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా సమయానుకూలతకు కంపెనీ బాధ్యత వహించదు. మీరు ఎట్టి పరిస్థితులలో ఈ సైట్ పై ఉన్న సమాచారం ఆధారంగా చర్య తీసుకోకూడదు లేదా దాని పై ఆధారపడకూడదు. సైట్ మరియు/లేదా సర్వీసు యొక్క సౌలభ్యతను అందుకోవడం మరియు ఉపయోగించడం, లేదా సైట్ పై పోస్ట్ చేసిన ఏదైనా సమాచారం ఉపయోగించడం పూర్తిగా మీ బాధ్యతే. మీకు సేవలను “ఉన్నట్లుగా” మరియు “అందుబాటులో ఉన్న విధంగా” అందించబడతాయని మీకు అవగాహన ఉంది మరియు మీరు అంగీకరిస్తున్నారు. వాణిజ్యం, ఏదైనా నిర్దిష్ట ప్రయోజనానికి సామర్థ్యం, లేదా ఉల్లంఘించలేదని ప్రకటించిన లేదా అనువర్తించే విధంగా, పైవాటికి పరిమితి లేకుండా, చట్టం అనుమతించిన విధంగా పూర్తి స్థాయిలో కంపెనీ అన్ని హామీలను నిరాకరిస్తుంది. సైటును ఉపయోగించడం వల్ల మరియు లేదా సేవను మరియు/లేదా సైట్ పై పోస్ట్ చేసిన సమాచారాన్ని ఉపయోగించడం వల్ల లేదా దానికి సంబంచింధి కలిగిన ఏవైనా నష్టం, డ్యామేజీలకు, పరిమితి లేకుండా ఏ రకమైన ప్రత్యక్ష, పరోక్ష, యాదృచ్ఛిక, శిక్షాత్మకమైన మరియు పరిణామాత్మక నష్టాలకు సంబంధించి కంపెనీ బాధ్యత వహించదు. మీరు సైట్ పై రిజిస్టర్ చేసుకోవాలని ఎంచుకోవడం మరియు సేవలను అందుకోవడం ద్వారా మీ జీవితంలోని సమస్యలను అధిగమిస్తారని ఎటువంటి వర్తిత లేదా ప్రకటిత గ్యారెంటీని లేదా హామీని కంపెనీ ఇవ్వదు. యూజర్ మరియు/లేదా మెంబర్ సంభాషణల యొక్క దోషాలు, మినహాయింపులు, అడ్డంకులు, తొలగించడాలు, లోపాలు, ఆపరేషన్ లేదా ప్రసారంలో ఆలస్యాలు, సంభాషణ లైన్ వైఫల్యం, దొంగతనం లేదా నాశనం లేదా అనధికారిక యాక్సెస్ లేదా సవరణలకు సైట్ యొక్క బాధ్యత ఏమీ లేదు. ఏవైనా టేలిఫోన్ నెట్వర్క్ లేదా లైన్లు, కంప్యూటర్ ఆన్-లైన్-సిస్టంలు, సర్వర్లు లేదా ప్రొవైడర్లు, కంప్యూటర్ ఉపకరణాలు, సాఫ్ట్ వేర్ యొక్క సమస్యలు లేదా సాంకేతిక అపసవ్య పనితీరుకు, ఇంటర్నెట్ లేదా ఏదైనా వెబ్సైట్ లేదా వాటి కాంబినేషన్ యొక్క సాంకేతిక సమస్యలు లేదా ట్రాఫిక్ కంజెషన్ వల్ల ఈమెయిల్ లేదా ఖాతా పై ప్లేయర్లు విఫలం కావడానికి, సైట్ మరియు/లేదా సేవకు సంబంధించిన సమాచారాన్ని డౌన్లోడ్ చేయడం లేదా అందులో పాల్గొనడం వల్ల యూజర్లు మరియు/లేదా మెంబర్లు లేదా ఎవరైనా ఇతర వ్యక్తి యొక్క కంప్యూటరుకు కలిగిన ఏదైనా నష్టం లేదా డ్యామేజీలకు సైట్ బాధ్యత వహించదు.
- బాధ్యత యొక్క పరిమితి
ఎటువంటి సందర్భంలోనూ ఏరకమైన పరోక్ష, పరిణామాత్మక, శ్రేష్టమైన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలకు, మీరు సైట్ లేదా సేవను ఉపయోగించడం వల్ల లేదా మీరు అందించిన డేటా, కంటెంట్, సమాచారం, సామగ్రిలోని దోషాలు, పొరపాట్లు లేదా అవి ఖచ్చితంగా లేకపోవడం వల్ల లాభాలను కోల్పోవడంతో సహా, మరియు వాటికే పరిమితం కాకుండా, కంపెనీ అటువంటి నష్టాలు కలగవచ్చునని మీకు సలహా ఇచ్చినప్పటికీ, కంపెనీ మీకు లేదా ఏ ఇతర మూడవ పక్షానికి బాధ్యత వహించదు. ఇందులోని వాటికి విరుధ్ధంగా ఉన్న దేనికీ సంబంధం లేకుండా, కంపెనీ, ఎటువంటి కారణం వల్లనైనా మరియు చర్య యొక్క రూపానికి సంబంధం లేకుండా, మీకు అన్ని వేళలా మీరు సేవల కొరకు కంపెనీకి చెల్లించిన కన్సల్టెన్సీ ఛార్జీల వరకే పరిమిత బాధ్యతను కలిగి ఉంటుంది.
- నష్టపరిహారం
ఈ ఒప్పందం యొక్క ఉల్లంఘన మరియు/లేదా మీ ప్రతినిధుల యొక్క ఏదైనా అతిక్రమణ, మరియు ఈ ఒప్పందంలో ఇందుమీదట ఏర్పరచిన ఏవైనా హామీలను ఉల్లంచించి మీరు సేవను ఉపయోగించుకున్నందు వల్ల కలిగిన, ఏదైనా నష్టం, బాధ్యత, దావా లేదా డిమాండ్, మరియు ఏదైనా మూడవ పక్షం చేసిన సహేతుకమైన న్యాయవాది రుసుముతో సహా, వీటి వల్ల కంపెనీ మరియు/లేదా దాని అధికారులు, మేనేజర్లు, సభ్యులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, వారసులు, అసైనీలు, సబ్సిడియరీలు, అనుబంధ సంస్థలు/వ్యక్తులు, సరఫరాదారులు మరియు ప్రతినిధులకు ఎటువంటి హాని కలగకుండా మీరు నష్ట పరిహారం చెల్లించడానికి ఒప్పుకుంటున్నారు.
- సేవలకు అదనపు ఉపయోగ నియమాలు
- ఇందుమీదట అందించబడే సరళ్వాస్తు భావన మరియు సేవలు పూర్తిగా దిశా శాస్త్రం, నిర్మాణ శాస్త్రం, శక్తి శాస్త్రం మరియు చక్ర శాస్త్రం ఆధారితమని మీరు అంగీకరిస్తున్నారు మరియు ధృవీకరిస్తున్నారు.
- భారతదేశం నిషేధించిన ఎటువంటి మంత్రపూర్వక పరిష్కారాలు లేదా సేవలను మేము అందించము మరియు ఎటువంటి మంత్రాత్మక మార్పులను నిర్ధారించము కానీ మీ సమస్యలను అధిగమించడానికి మీ పరిసరాలలో శక్తిని మెరుగుపరచడానికి తప్పకుండా కృషి చేస్తాము.
- మా సరళ్-వాస్తు భావన, దాని ప్రక్రియలు, మీ పరిసరాలకు రావడానికి మీ అనుమతి యొక్క ధృవీకరణ, సాక్ష్యాల వంటి వాటికి సంబంధించిన సమాచారంతో సహా, కానీ వాటికే పరిమితం కాని ఇతర సమాచారం కొరకు మీకు మీ నమోదిత మొబైల్ నంబరు పై ఎస్.ఎం.ఎస్. పంపించడానికి లేదా కాల్ చేయడానికి, ఈమెయిల్ పంపించడానికి మీరు మాకు అధికారం ఇస్తున్నారు. ఇలా పంపబడిన ఎస్.ఎం.ఎస్. లేదా చేసిన కాల్, ఒకవేళ మీరు డి.ఎన్.డి. జాబితా క్రింద నమోదు అయినప్పటికీ, టి.ఆర్.ఎ.ఐ. నియమాల ఉల్లంఘనగా పరిగణించబడదని మీరు ఇందుమీదట అంగీకరిస్తున్నారు.
- మీ పరిసరాలను సందర్శించిన సమయంలో, మీ పరిసరాల లోపల మరియు బయట మా ప్రతినిధి పోటోలు తీసుకుంటారు. ఈ చిత్రాలు తదుపరి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తయారు చేసిన మీ పరిసరాల యొక్క లేఔట్ చార్టును ధృవీకరించడానికి, దిశా శాస్త్రం, నిర్మాణ శాస్త్రం, శక్తి శాస్త్రం మరియు చక్ర శాస్త్రం ప్రకారం లోపాలను గుర్తించడానికి మరియు పైన ఉదహరించిన లోపాలకు అనుగుణంగా పరిష్కార చర్యలను సూచించడానికి ఉపయోగించబడతాయి. ఈ పరిష్కార సూచనలు మా ప్రతినిధి ఇచ్చే సూచనల ప్రకారం ఉపయోగించడానికి ఒక కిట్‌తో సహా ఇవ్వబడతాయి.
- సేవలను అందించే ప్రయోజనానికి మీ పరిసరాల చిత్రాలను ఉపయోగించడానికి గాను మీరు మా కంపెనీకి వెనక్కి తీసుకోలేని హక్కు మరియు అనుమతిని ఇందుమీదట అందిస్తున్నారు.
- ఉదహరించిన ఫోటో చిత్రాల పంపిణీ లేదా ఉపయోగం లేదా దాని నుండి తలెత్తే గోప్యత అతిక్రమణ యొక్క దావా, కాపీ రైట్ ఉల్లంఘన వంటి వాటితో సహా కాని వాటికే పరిమితం కాని అన్ని దావాలు, డిమాండ్లు, హక్కులు, ప్రమాణాలు, నష్ట పరిహారాలు మరియు బాధ్యతల నుండి కంపెనీకి, దాని అధికారులకు, ఉద్యోగులకు విడుదల, విముక్తి మరియు శాశ్వత ఉత్సర్గాన్ని ఇందుమీదట ఇస్తున్నారు.
- మీరు మా ప్రతినిధిని పరిసరాలలోకి అనుమతించాలి మరియు వారి అవసరానికి తగినట్లుగా పరిసరాలను ఉపయోగించుకోనివ్వాలి. వారికి పరిసరాల పై అందుబాటులో ఉన్న ఏవైనా సౌలభ్యతలను ఉపయోగించుకోవడానికి అనుమతినివ్వాలి, సహకరించాలి, అందించాలి మరియు కాలానుగుణంగా సేవలను సమర్థవంతంగా అందించడానికి అవసరమైన ఏవైనా అదనపు సహాయం లేదా వనరులను అందించాలి.
- మీరు మా సేవలను డిజిటల్ మాధ్యమం ద్వారా అందుకోవడాన్ని ఎంచుకుని ఉంటే, మీ పరిసరాల యొక్క లేఔట్‌ను గీయడం కొరకు మా ప్రతినిధికి డిజిటల్ మాధ్యమం ద్వారా మీరు అందించే మీ పరిసరాల యొక్క ఫోటో చిత్రాలకు బాధ్యత పూర్తిగా మీదే. సేవలకు సంబంధించి చెప్పబడిన ఖచ్చితంగా లేని చిత్రాల ఆధారంగా ఇచ్చిన సలహాల వల్ల తలెత్తే లేదా మీరు అనుభవించే ఎటువంటి నష్టం, ఖర్చులు, వ్యయాలు, నష్టపరిహారాలకు మేము బాధ్యులము కాము.
- సేవలను అందించడానికి మేము అన్ని అవసరమైన వనరులను, మానవ వనరులతో సహా నియమిస్తాము మరియు మీకు తెలియజేయకుండా లేదా మీ సమ్మతి లేకుండా, అటువంటి వనరులను నియమించడానికి, పనిలో పెట్టడానికి మరియు/లేదా మార్చడానికి మాకు హక్కు ఉంది.
- మా సూచనలను 100% అమలు పరచిన తరువాత, మీరు అమలు తనిఖీ సందర్శన [ఇంప్లిమెంటేషన్ చెక్ విజిట్] (“ఐసివి”) కొరకు మా కన్సల్టెంటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసివిని వాట్సాప్ లేదా ఇతర డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహిస్తారు.
- డిజిటల్ పరిశీలనకు అదనంగా లేదా దానికి బదులు మీరు భౌతిక అమలు తనిఖీ సందర్శనను ఉపయోగించుకోవాలంటే, అప్పుడు మీకు తగిన సందర్శన ఛార్జీలు వర్తింపబడతాయి.
- కస్టమర్ చేయవలసిన ప్రాతినిధ్యాలు మరియు సమ్మతులు
- మీకు సరళ్వాస్తు యొక్క భావన, తద్వారా అందించే సేవలు మరియు దానికి సంబంధించిన షరతులు మరియు నియమాల పై అవగాహన ఉంది మరియు వాటిని ధృవీకరిస్తున్నారు, మరియు వాటికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, వాటిని పరిష్కరించుకోవడానికి మీకు తగినంత సమయం మరియు అవకాశం ఇవ్వబడింది.
- ఈ సేవలను మీరు స్వచ్చందంగా ఎంచుకున్నారని మీరు అంగీకరిస్తున్నారు మరియు ధృవీకరిస్తున్నారు. తదుపరి, ఈ సేవలను ఉపయోగించుకోమని మేము మిమ్మల్ని ప్రేరేపించలేదని మీరు అంగీకరిస్తున్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరియు నిర్ధారిస్తున్నారు.
- సూచనలు అమలు పరచడానికి కొన్ని వస్తువులు/సామగ్రిని సేకరించవలసి ఉంటుందని మీకు అవగాహన ఉంది మరియు మీరు అంగీకరిస్తున్నారు మరియు ఆ కొనుగోళ్ళను మీరే చేస్తారు మరియు ఆ కొనుగోళ్ళ విషయమై మమ్మల్ని బాధ్యులను చేయరని కూడా మీరు ధృవీకరిస్తున్నారు.
- ఈ సేవల క్రింద ఇవ్వబడిన సలహాను అమలు పరిచిన తరువాత మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చర్యలు మరియు ఫలితాలకు మీరు మాత్రమే బాధ్యులని మీకు అవగాహన ఉంది మరియు మీరు ధృవీకరిస్తున్నారు మరియు ఈ సేవలను ఉపయోగించుకోవడం వల్ల జీవితంలో మీరు అనుభవించే లేదా మీరు తీసుకునే ఎటువంటి నిర్ణయాలు, చర్యలు మరియు ఫలితాలకు కూడా ఏ సమయంలోనైనా మరియు ఎట్టి పరిస్థితులలోనూ కంపెనీ మరియు/లేదా దాని అధికారులు, మేనేజర్లు, సభ్యులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, వారసులు, అసైనీలు, సబ్సిడియరీలు, అనుబంధ సంస్థలు/వ్యక్తులు, సరఫరాదారులు మరియు ప్రతినిధులను బాధ్యులను చేయమని మీరు అంగీకరిస్తున్నారు.
- ఇందుక్రింద అందించే సేవలకు సంబంధించి, ఈ ఒప్పందం క్రింద వీలుకల్పించి ఉంటే తప్ప, కంపెనీ మరియు/లేదా దాని అధికారులు, మేనేజర్లు, సభ్యులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, వారసులు, అసైనీలు, సబ్సిడియరీలు, అనుబంధ సంస్థలు/వ్యక్తులు, సరఫరాదారులు మరియు ప్రతినిధులు అన్ని చట్టపరమైన లేదా ఇతర హామీలు, ప్రాతినిధ్యాలు లేదా ప్రకటించిన లేదా వర్తించే గ్యారెంటీలను తిరస్కరిస్తున్నారని మీరు అంగీకరిస్తున్నారు.
- కస్టమర్ యొక్క విధులు మరియు బాధ్యతలు
- సర్వీసులు అందుకోవడానికి మీరు సైటులో మరియు/లేదా రిజిస్ట్రేషన్ ఫారంలో అందించే సమాచారం యొక్క ఖచ్చితత్వం మరియు సవ్యతకు బాధ్యత మీదే మరియు ఇవ్వబడిన పత్రంలో అడిగిన జబ్బులు/ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి రిజిస్ట్రేషన్ పారంతో సహా వైద్య నివేదికల కాపీని సమర్పించాలి.
- మీరు కిట్‌ను సంస్థ మరియు/లేదా దాని ప్రతినిధి సూచించిన విధంగా ఉపయోగించాలి.
- కంపెనీ మరియు/లేదా దాని అధికారులు, మేనేజర్లు, సభ్యులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, వారసులు, అసైనీలు, సబ్సిడియరీలు, అనుబంధ సంస్థలు/వ్యక్తులు, సరఫరాదారులు మరియు ప్రతినిధులు అందించే సేవలకు ప్రజల దృష్టిలో అప్రతిష్ట కలిగించే విధంగా లేదా వాటి పై అనుమానాన్ని కలిగించే విధంగా లేదా బ్రాండ్ ఇమేజ్ పై ప్రభావం కలిగించే విధంగా మీరు ఎటువంటి చర్యలోనూ పాల్గొనకూడదు.
- లోపాలున్న/పాడయిన కిట్‌ను తిరిగి ఇవ్వడం
- కిట్ అందుకున్న వెంటనే మీరు ఉత్పత్తులను నిశితంగా పరిశీలించాలి.
- ఒకవేళ మీకు లోపాలున్న/పాడయిన కిట్ లభిస్తే, మీరు దాన్ని అందుకున్న 14 రోజుల లోపల మా సేవా కేంద్రాన్ని సంప్రదించాలి.
- మీ రిటర్న్ అభ్యర్థన అందుకున్న తరువాత, ఉత్పత్తిలో లోపాలు/పాడవ్వడం ఉందన్న మీ ఫిర్యాదును పరిశీలించడానికి ఒక నాణ్యతా తనిఖీకి ఏర్పాటు చేస్తాము. రిటర్న్/భర్తీ గురించి మీరు ఇచ్చిన ఫిర్యాదు అభ్యర్థనను విజయవంతంగా ధృవీకరించిన మీదట, ఆ లోపాలున్న/పాడయిన వస్తువుకు సంబంధించిన ప్రాసెస్ చేస్తాము. లోపాలున్న/పాడయిన వస్తువులకు సంబంధించి మాత్రమే రిటర్న్/భర్తీ అంగీకరించబడుతుంది. కంపెనీ యొక్క నిర్ణయమే ఆఖరు మరియు దానికి మీరు లోబడి ఉండాలి.
- కస్టమరుతో కౌన్సిలింగును రికార్డు చేయడం
- ఆచరణ మరియు ప్రామాణికత కొరకు కౌన్సిలింగ్ యొక్క రికార్డులను భద్రపరచడం అవసరమని మీకు అవగాహన ఉంది మరియు మీరు అంగీకరిస్తున్నారు. ఇందుమీదట మీరు కంపెనీకి కౌన్సిలింగ్ సెషన్ యొక్క వీడియో మరియు ఆడియో రికార్డింగుకు అనుమతినిస్తున్నారు. ఈ రికార్డింగులు మీకు అందించే సేవలకు మద్దతుగా ఉపయోగించబడతాయి.
- రికార్డింగులలో ఉండే సమాచారం గోప్యమైనది, మరియు మేము ఆ సమాచారం యొక్క గోప్యతను కాపాడడానికి కావలసిన కృషిని చేస్తాము. సేవలను అందించడానికి ఈ సమాచార లభ్యత అవసరమున్న సంస్థ యొక్క ఉద్యోగులు, అధికారిక ప్రతినిధులు, కన్సల్టెంటులు మరియు వ్యాపార అనుసంధానకులకు తప్ప, చట్టపరంగా తప్పనిసరి అయితే తప్ప, సంస్థ ఏ ఇతర వ్యక్తి లేదా సంస్థకు ఈ సమాచారాన్ని బహిర్గత పరచదు.
- ఇతర విషయాలు
- మీరు అందించిన కంటెంట్, సమాచారం, వ్యక్తిగత సమాచారంతో సహా, ఖచ్చితంగా ఉంది మరియు సరి అయినది అని మీరు నిర్ధారిస్తున్నారు.
- మీ ప్రొఫైల్‌లోని మీ గుర్తింపు, చిరునామా వంటి వివరాలను ధృవీకరించడానికి మీ డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు లేదా ఏదైనా ఇతర ప్రభుత్వం గుర్తించిన పత్రాలను సమర్పించమని మీకు ధృఢంగా సూచించబడుతున్నది.
- రుసుములు మరియు ఛార్జీలను వసూలు చేయడానికి కంపెని మూడవ పక్ష గేట్వేలను ఉపయోగిస్తుంది. చెల్లింపు గేట్‌వే విఫలమైన పక్షంలో సభ్యులకు చెల్లింపు గేట్‌వే సరఫరాదారు ఆ విషయాన్ని తెలియజేస్తారు. చెల్లింపు గేట్‌వే నుండి అదనపు కరెన్సీ/మార్పిడి ఛార్జీలు/తగ్గింపులు/తప్పుల వంటి సమస్యలకు కంపెనీ బాధ్యత వహించదు. ఒకవేళ ఆన్లైన్ లావాదేవీలు విఫలం కావడం వల్ల సేవలు అందించబడకపోతే (నో సర్వీస్), చెల్లింపు గేట్‌వే ద్వారా మీ కార్డు/బ్యాంకు ఖాతాలకు అందవలసిన తిరిగి చెల్లింపుల యొక్క ఖచ్చితత్వానికి మరియు సమయానికి కంపెనీ బాధ్యత వహించదు.
- మెంబర్ కావడం ద్వారా, మీరు కంపెనీ, దాని అనుబంధ సంస్థలు, సహచర సంస్థలు, అఫిలియేట్లు మరియు వ్యాపార భాగస్వాముల నుండి కొన్ని ఈమెయిల్స్, ఫీడ్ బ్యాక్ కొరకు కాల్స్ మరియు ప్రమోషనల్ ఆఫర్లను అందుకోవడానికి అంగీకరిస్తున్నారు.
- ఈ ఒప్పందం యొక్క ఏ భాగమైనా చెల్లనట్లయితే, ఈ ఒప్పందం యొక్క మిగిలిన భాగం పూర్తి శక్తి మరియు ప్రభావంతో కొనసాగుతుంది.
- ఉపయోగ నియమాలను మార్చే హక్కు
ఏ కారణం చేతనైనా, మరియు నోటీసు లేకుండా, కాలానుగుణంగా ఉపయోగ నిబంధనలను సవరించడానికి కంపెనీకి హక్కు ఉంది. ఇందులోని మార్పులను మీరు గుర్తించడానికి, దయచేసి ఈ ఒప్పందాన్ని తరచుగా సమీక్షించండి. ఈ ఒప్పందం యొక్క కాలంలో, మేము షరతులు మరియు నిబంధనలను సవరించవచ్చు మరియు ఈ ఒప్పందం ప్రకారం అందించే సేవలను మార్చవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. సవరించిన ఒప్పందం విడుదల అయిన వెంటనే లేదా మా సైట్లో సేవలలో మార్పు చేసిన వెంటనే, అటువంటి పునర్విమర్శ లేదా మార్పు వర్తిస్తుంది మరియు ప్రభావవంతంగా ఉంటుంది. మేము స్పష్టంగా తెలియపరచకపోతే తప్ప, ఈ నిబంధనలు సేవలకు సంబంధించిన ఇతర నిబంధనలను కలిగి ఉంటాయి మరియు అధిగమిస్తాయి.
- చట్టపరిధి మరియు వర్తించే చట్టాలు
కంపెనీ భారతదేశంలో నవీ ముంబైలో ఉన్న తన ప్రధాన కార్యాలయం నుండి సైట్‌ను నియంత్రిస్తుంది మరియు నిర్వహిస్తుంది మరియు సైట్‌లోని సమాచారం/సామగ్రి ఇతర ప్రాంతాలలో ఉపయోగించడానికి తగినవని లేదా అందుబాటులో ఉంటాయి అని కంపెని ఎటువంటి ప్రాతినిధ్యం వహించదు. ఈ సైట్‌ను మీరు ఇతర ప్రదేశాల నుండి ఉపయోగిస్తే, ఇతర దేశాల ఎగుమతి మరియు దిగుమతి నియమాలతో సహా, కానీ వాటికే పరిమితం కాని వర్తించే స్థానిక చట్టాలకు లోబడి ఉండవలసిన బాధ్యత మీదే. స్పష్టంగా ప్రకటిస్తే తప్ప, ఈ సైట్ పై ఉన్న అన్ని మార్కెటింగ్ మరియు ప్రమోషనల్ సమాచారం భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తులు, సంస్థలు లేదా ఇతర ఎంటిటీలకు నిర్దేశించబడ్డాయి మరియు భారతదేశంలో ఆ సమయంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడి ఉన్నాయి. ఈ ఒప్పందం నవీ ముంబై, భారతదేశంలో అమలు చేయబడినట్లుగా పరిగణించబడుతుంది. సైట్‌ను మరియు/లేదా సేవను మరియు/లేదా ఈ ఒప్పందం యొక్క ఉపయోగ నియమాలను యాక్సెస్ చేయడం వల్ల మరియు/లేదా ఉపయోగించడం వల్ల మరియు/లేదా వాటికి సంబంధించి తలెత్తే ఇటువంటి అన్ని వివాదాలు మరియు/లేదా తేడాలు భారతదేశం యొక్క చట్టాలచే నిర్వహించబడతాయి మరియు భారతదేశంలోని నవీ ముంబై న్యాయస్థానం యొక్క ప్రత్యేక అధికార పరిధికి సమర్పించబడతాయి
TERMS OF USE (Version 2.0 – 11-05-2018)