డాక్టర్ చంద్రశేఖర్ గురూజీ

ఫౌండర్, గైడ్, లక్షల మంది ప్రజలకు దిశానిర్దేశం చేయుచున్నారు

“కలలు అనేవి మీరు నిద్రలో చూసేవి కావు, మిమ్మల్ని నిద్రపోనివ్వనివి – డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం.”

ఇది సరళ వాస్తు సృష్టి కర్త మరియు దీని వెనక ఉన్న బలమైన డాక్టర్. చంద్రశేఖర అంగడి( గురూజీ) గారికి నిజంగా వర్తిస్తుంది.

బాల్యం నుంచి గురువు గారు, మానవ కోటి ఎదుర్కొనే సమస్యలపై తీవ్రంగా ఆవేదన చెందేవారు. వారి ముత్తాతల కాలంలో కట్టించిన ఒక పాత దేవాలయ పునరుత్థానం కొరకు కేవలం 8 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రజల నుంచి చందాలను సేకరించారు. ఒకప్పుడు సానుకూల శక్తితో నిండిన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించడం ద్వారా తాను పుట్టిన పట్టణంలోని నివసించే ప్రజల జీవితాల్లోనికి తిరిగి సంతోషాన్ని తీసుకురావడంపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.

14 సంవత్సరాల వయస్సులో తన జీవితాన్ని విలువైన దానిగా ఎలా మలచుకోవాలనే భావన గురూజీ మదిలోనికి వచ్చింది, దాంతో ఆయన సాయుధ బలగాల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అనేకసార్లు ప్రయత్నించినా వైద్యపరమైన కారణాల వల్ల ఎంపిక కాలేకపోయారు.అయితే ఇది ఆయన ఆలోచనల్లో మార్పు తీసుకురాలేకపోయింది, ముంబైలో సివిల్ కాంట్రాక్టర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. ఆపన్నులకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 1995లో ‘శారన్ శంకుల ట్రస్ట్’ని ఆయన ప్రారంభించారు. ట్రస్ట్‌కు ఫౌండర్ మరియు ట్రస్టీగా ఆయన వ్యవహరించారు.

ఆయన చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన తరువాత, ముంబైలో సివిల్ కాంట్రాక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించి, తాను ఎంచుకున్న రంగంలో విజయం సాధించారు. తన జీవితంలో సత్యాన్ని నమ్ముకున్నారు, అలానే, తన కెరీర్లో నిజాయితీగా ఉండే పథాన్ని ఆయన ఎంచుకున్నారు. ఇటువంటి సమయంలో ఆయన వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా అయితే గందరగోళానికి గురవుతామో ఆయన మనస్సు కూడా అలానే కలత చెందింది.
పరిస్థితులకు ఇతరులను నిందించడానికి బదులుగా, గురూజీ మానసిక అశాంతికి కారణమైన తమ వ్యాపారంలోని సమస్యలకు మూలకారణం ఏమిటని ఆత్మవిమర్శ చేసుకోవడం ప్రారంభించారు.

1998 మధ్యలో, ఆయనకు కలల్లో తన ఇంటి లేవుట్ని మరియు దిక్చూచి తరచుగా కనిపించేవి. కొంతకాలంపాటు ఆయనకు అదే కల వచ్చేది, ఈ కలకు అర్థాన్ని వెతకడాన్ని ప్రారంభించినప్పుడు, తన కలతో తన జీవితం ముడి పడి ఉన్నదని ఆయన అర్థం చేసుకున్నారు.

దీనితో ఆయన నిజాన్వేషణ ప్రారంభమైంది, తన సమస్యలకు మూలకారణం తన ఇంటిలోను మరియు పని ప్రాంతంలో ఉన్నదని ఆయన అర్థం చేసుకున్నారు. ఈ విషయంలోనికి మరింత లోతుగా వెళ్లడం ప్రారంభించారు, మన పూర్వీకులు ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన అందమైన కట్టడాలు కాలాన్ని తట్టుకుని ఇంకా సురక్షితంగా ఉండటం ఎలా సాధ్యమైందనే భావనలను ఆయన అర్థం చేసుకోవడం ప్రారంభించారు.

కొంతకాలం పరిశోధించిన తరువాత, భారతీయ సంస్కృతి మరియు ఆర్కిటెక్చర్‌ని సమ్మిళితం చేసి ‘సరళ వాస్తు’ అనే ఒక ప్రత్యేక శాస్త్రీయ పరిష్కారాన్ని రూపొందించారు, దీనిని పాటించడం ద్వారా ఒక వ్యక్తి మరియు అతని కుటుంబంలోని వారి అందరి జీవితాల్లో అన్ని విధాలా సంతోషం మరియు విజయం లభిస్తుంది.

గురూజీ పంచసూత్రాలు

యువకులు మరియు చురుకైన చంద్రశేఖర్, ఒక లోకోపకారి, మార్గదర్శి, దిశానిర్దేశకునిగా పరివర్తన చెందే కాలంలో, తన కలలను సాకారం చేసుకోవడం కొరకు అవిశ్రాంతంగా పనిచేశారు. ఆయన తన జీవితంలో ఐదు ముఖ్యమైన.

జీవితంలో ఎవరిని మోసం చేయకండి.

నిజాయితీగా జీవితాన్ని గడపడం ద్వారా మనము మన దేహాన్ని మరియు ఆత్మను ప్రక్షాళన చేయవచ్చును.అన్ని సమయాల్లో నిజాయితీగా వుంటే వృత్తిపరంగా ప్రతిదీ సంవృద్ధిగా లభిస్తుంది.

మీరు ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ వినయంగా ఉండండి.

మీరు గొప్ప విజయాలను సాధించవచ్చు, అయితే ఆడంబరాలకు పోకుండా నేలపై నిలబడి ఉండటం అనేది ముఖ్యం. ఇది మీకు పేరుప్రఖ్యాతులను అందించడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉండే వారి మద్దతును కూడా అందిస్తుంది.

మీ తల్లిదండ్రులను ఎల్లప్పుడూ సంతోష పెట్టండి, వారి ఆశీర్వచనాలను తీసుకోండి.

‘‘ ఎవరైనా తనపట్ల శ్రద్ధ వహించడం కంటే, తోటివారి పట్ల శ్రద్ధ వహించడం అత్యుత్తమ గౌరవం- అని టిమ్ వాకర్ పేర్కొంటాడు. తమ సృష్టికర్తల( మీ తల్లిదండ్రులు) పట్ల శ్రద్ధ వహించి, వారిని సంతోష పెట్టే వారి కుటుంబంలో సంవృద్ధి, విజయం వరిస్తాయి.

అవసరం ఉన్న వ్యక్తులకు సహాయపడండి.

నిస్వార్థ ప్రేమ మరియు మద్దతు ఇవ్వడం, ఆదుకోవాల్సిన వ్యక్తులకు చేయూత అందించడం ద్వారా సమృద్ధి లభిస్తుంది.

సంతోషంగా ఉండండి మరియు ఇతరులను సంతోష పెట్టండి.

సంతోషం అనేది మనం జీవించే ప్రదేశం మరియు కార్యాలయాల నుంచి లభిస్తుంది, అందువల్ల అంతర్గత సంతోషాన్ని పొందడం అనేది ముఖ్యం, ఇది ఇతరులను కూడా సంతోష పెడుతుంది.