ఈ భూమండలం మీద ఉన్న ప్రతి వ్యక్తికి వివాహం మరియు సంబంధాల నిర్వహణ కొరకు కొంత అదృష్టం అవసరం అవుతుంది- ఆ అదృష్టమే వాస్తు. ఇది ఒక పవిత్రమైన శాస్త్రం, మనందరిలో చిన్నమొత్తాల్లో ఉండే శక్తిని మరియు మన పరిసరాల్లో ఉండే శక్తిని వాస్తు పెంపొందిస్తుంది. ఈ రెండు శక్తులు సమకాలీకరించబడినప్పుడు మన వ్యక్తిత్వం ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతుంది మరియు శాంతి, సామరస్యం పెంపొందించబడుతుంది.సంబంధాల కొరకు వాస్తు చిట్కాలు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి మరియు తమ జీవితాన్ని ప్రేమ మరియు అనురాగంతో జీవించడం కొరకు ఒక బలమైన బంధాన్నిఏర్పరుచుతాయి. ఈ వాస్తు చిట్కాలను మరిముఖ్యంగా బెడ్రూమ్లో అమలు చేయాలి, అయితే ఇంటిలో కొన్ని ప్రాంతాలు సంబంధాల కొరకు ఉద్దేశించబడినవి( నిర్మాణ లోపం వల్ల ఇవి సరిపోక పోవచ్చు)ఇవి వాస్తును సరిగ్గా అమలు చేయడానికి దోహదపడతాయి. సరళవాస్తు యొక్క సంబంధాల కొరకు వాస్తు అనేది ప్రతి దోషానికి పరిహారాన్ని అందిస్తుంది.

బెడ్ రూమ్ కొరకు కొన్ని వాస్తు చిట్కాలు దిగువన ఇవ్వబడ్డాయి:
- బెడ్రూమ్లో వేలాడదీయాల్సిన అత్యుత్తమ పెయింటింగ్ లేదా ఫోటోలు మీకు తెలుసా? మెరుగైన సంబంధాల కొరకు జంటల ఫోటోలను పడకగదిలో వేలాడదీయాలి(ఉదాహరణకు రాధాకృష్ణులు, లేదా భార్యభర్తలు, లవ్ బర్డ్స్ మొదలైనవి) ఈ ఫోటోలను తీసుకొని నిర్ధిష్ట సంబంధాల స్థానంలో వేలాడదీయాలి. ఈ దృశ్యాల్లో జంటల మధ్య శాంతి, ప్రేమ మరియు శృంగారం చిగురించేట్లుగా చేస్తాయి.
- మీ ఇంటిలో సంబంధాల స్థానం ఎక్కడ ఉంది, మరియు అది సరిగ్గా నిర్మించబడిందా? ఇంటిని నిర్మించడానికి ముందు సంబంధాల స్థానాన్ని మార్క్ చేయండి మరియు ఇది ఇంటి యజమాని లేదా ఇంటిలో సంపాదనాపరుడి యొక్క పుట్టిన తేదీపై ఆధారపడి ఉంటుంది. సంబంధాల స్థానంలో దుస్తులను ఉతకడం మరియు పాత్రలను శుభ్రం చేడయం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి. సంబంధాల స్థానాన్ని కనుగొనండి మరియు ఆరోగ్యవంతమైన సంబంధాలను ఆస్వాదించడం కొరకు వాస్తుపరమైన మార్పులు చేయండి.
- మీ ఇంటిలో గోడల పెయింటింగ్ ఎలా ఉండాలి? మీ ఇంటిలో తేలికపాటి రంగుల్లోని పెయింటింగ్లను ఉపయోగించడం వల్ల ప్రశాంతత ఉంటుంది. ముదురు రంగులు మరియు దుడుకైన రంగుల్ని ఉపయోగించవద్దు.
Related posts
Leave Comment







