
వాస్తు ప్రకారం నిర్మించబడ్డ ఇంటిలో ఉండే వారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు, చక్కటి పురోభివద్ధి సాధిస్తారు. బాత్రూమ్లు ఇంటిలో ఒక ముఖ్యమైన విభాగం. వీటిని ఇంటిలో ఎక్కడైనా నిర్మించినట్లయితే, దాని వల్ల వ్యతిరేక శక్తి ప్రవహించడం, ఆరోగ్యం మరియు సంపదకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సరళవాస్తు సూత్రాలకు అనుగుణంగా ఇంటిలోని ఏదైనా ప్రదేశంలో మరుగుదొడ్డి మరియు బాత్రూమ్లు నిర్మించుకోవచ్చు.
మరుగుదొడ్డి మరియు బాత్రూమ్ యొక్క వాస్తు నుంచి మనం దేనిని ఆశించవచ్చు?
మరుగుదొడ్డి వ్యతిరేక శక్తిని ఉత్పత్తి చేస్తుంది కనుక మన పూర్వీకులు మరియు పెద్దవారు మరుగుదొడ్డిని ఇంటికి వెలుపల నిర్మించేవారు. తద్వారా వారి జీవితాలపై పడే వ్యతిరేక శక్తి తగ్గించబడేది. అయితే నేడు, మనం దీనికి వ్యతిరేకంగా చేస్తున్నాం. మనం మన సౌకర్యం మరియు విలాసం కొరకు మరుగుదొడ్డి మరియు బాత్రూమ్లను ఇళ్లలోనే నిర్మిస్తున్నాం, పెద్ద పెద్ద ఇళ్లలోనేూ ‘అటాచ్డ్ టాయిలెట్లు మరియు బాత్రూమ్లు’ ఇప్పుడు తప్పనిసరి అయ్యాయి.

