
కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవారు, తమకు అనుకూలమైన దిక్కులో ఇంటి ఫేసింగ్ ఉండేవిధంగా చూడాలని బిల్డింగ్/డెవలపర్/బ్రోకర్ని కోరుతుంటారు. స్వంత ప్లాట్లు ఉన్నవారు కొత్తగా ఇంటిని కట్టాలని అనుకునేవారు సైతం తమ ఇంటిని అత్యంత అనుకూలమైన దిశలో కట్టాలని కోరుకుంటారు. తమకు అనుకూలంగా లేని దిశల్లో ఉన్న ఇంటిలో జీవిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు పురోభివృద్ధి సాధించడం మనకు తెలుసు.
తండ్రి జీవితంలో అన్ని రకాల విజయాలు సాధించి, సంవృద్ధిని పొందినప్పటికీ, అదే ఇంటిలో నివసించే కుమారుడు, తండ్రిలా విజయాన్ని సాధించి, సంవృద్ధిని పొందలేకపోతాడు. ఇటువంటి వైవిధ్య పరిస్థితిని వివరించడం చాలా కష్టం, అయితే ఇది ఇంటి ప్రధాన ద్వారం వల్ల కలిగే సమస్యగా చెప్పవచ్చు. ప్రధాన ద్వారం ఎలా దోషిగా మారుతుంది?
ప్రవేశ మార్గం మరియు ప్రధాన ద్వారం కొరకు వాస్తు
సరళ వాస్తు ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన రోజు ఆధారంగా, ఆ వ్యక్తికి అనుకూలంగా ఉండే దిక్కులు నిర్ణయించబడతాయి. మీ ప్రధాన ద్వారానికి సంబంధించి జాగ్రత్త వహించాల్సిన అంశాలు:
ప్రధాన ద్వారానికి దగ్గరల్లో ఎన్నడూ చెత్తబుట్ట ఉంచవద్దు.
ప్రధాన ద్వారం ఎన్నడూ నల్లగా ఉండరాదు, ఈ ప్రాంతం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోండి.
ఇంటిలోనికి సానుకూల శక్తి ప్రవేశించేందుకు, ప్రధాన ద్వారం వద్ద చెత్తాచెదారాన్ని ఉంచవద్దు.
ప్రధాన ద్వారాన్ని ఓమ్, స్వస్తిక్ లేదా పువ్వులు, దీపాలు, సాంబ్రాణి కడ్డీలు పెట్టి అలంకరించండి, దీని వల్ల సానుకూల శక్తి ఉత్పత్తి అవుతుంది.
ప్రధాన ద్వారం ఎన్నడూ ఏదైనా మతపరమైన ప్రదేశానికి లేదా పాడుపడిన భవంతిని చూస్తూ ఉండరాదు, దీని వల్ల మీ ఇంటిలో వ్యతిరేక శక్తి ప్రవేశిస్తుంది.
ప్రధాన ద్వారానికి అడ్డంగా గోడలు కట్టరాదు, దీని వల్ల ఇంటిలోని ప్రవేశించే సానుకూల శక్తి నిలిచిపోతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం, ఆ ఇంటిలో నివసిస్తున్న లేదా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది.

