vastu-sharata

వాస్తు అనేది ‘‘నిర్మాణశాస్త్రం యొక్క సైన్సు’’

వాస్తుశాస్త్రం అనే సైన్సును ప్రాచీన భారతీయ నాగరికతలో అనేక వేల సంవత్సరాలపాటు అధ్యయనం చేయబడింది మరియు ఇది అత్యంత ముఖ్యమైన వేదశాస్త్రాల్లో ఒకటి. మానవ కోటి యొక్క సంక్షేమం మరియు వారి జీవన సమస్యల సమాధానాలు అనే స్ఫూర్తి ఆధారంగా వాస్తుశాస్త్రం ఆవిర్భవించింది. మూల పదం వాస్ యొక్క అర్థం ” వ్యవహరించడం, జీవించడం,ఉండటం” అనే అర్థాన్ని ఇస్తుంది.వాస్తుశాస్త్రం అనేది దిక్కులు యొక్క శాస్త్రం, కాస్మిక్ ఎనర్జీ మానవ జాతి పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిని వివరిస్తుంది. మానవ కోటి ప్రకృతి సంతులనం లో ఎలా జీవించాలనే విషయాలను తెలియజేస్తుంది.

ఇల్లు, కార్పొరేట్ ఆఫీసు, ఇండస్ట్రీ లేదా ఇనిస్టిట్యూషన్లో ప్రతి ప్రాంతానికి కూడా 8 దిక్కులుంటాయి, వీటిలో నాలుగు దిక్కులు మరియు మిగితా నాలుగు మూలలు. ప్రతి దిక్కు కు కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది, ఉదాహరణకు ఒక స్థలం యొక్క ప్రధాన ప్రవేశం అనేది ఇక నిర్ధిష్ట దిక్కులో ఉన్నట్లయితే, ఆ ప్రాంతంలో జీవించే లేదా పనిచేసే వ్యక్తులు ఆరోగ్యం, సంపద పొందడంతోపాటుగా సంబంధాలు మెరుగుపడతాయి.

దిక్కులు

మొత్తం ఎనిమిది దిక్కులున్నాయి, ప్రతి దిక్కు కూడా 45 డిగ్రీల కోణంతో వేరు చేయబడుతుంది, మరోవిధంగా చెప్పాలంటే ప్రతి దిక్కు 45 డిగ్రీలు కవర్ చేస్తుంది.

సవ్యదిశలో దిక్కులు:

1. North – Uttarā – ఉత్తరం
2. North East – Aiśānī – ఈశాన్యం
3. East – Pūrvā – తూర్పు
4. South East – Āgneyī – ఆగ్నేయం
5. South – Dakṣhiṇā – దక్షిణం
6. South West – Nairṛṛtā – నైరుతి
7. West – Paścimā – పశ్చిమం
8. North West – Vāyavyā – వాయువ్యం

దిక్కులను కనుగొనడానికి కంపాస్ ఎలా ఉపయోగించాలి

  • కంపాస్ కదలకుండా మీ అరచేతి మధ్యలో కంపాస్ ఉంచుకోండి.
  • ఎర్ర సూచి ఉత్తర దిక్కుకు వచ్చేంత వరకు కంపాస్ని తిప్పండి.