vastu-plans-for-house

వాస్తు శాస్త్రం అనేది ప్రకృతిలో ఉండే పంచభూతాలు మరియు కాస్మిక్ శక్తి యొక్క సంయోగము. సరళవాస్తు ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ, లింగం వంటి వివరాల ఆధారంగా రుజువు చేయబడ్డ శాస్త్రీయ పరిష్కారాలను అందిస్తుంది, ఇది వారికి సంతోషాన్ని మరియు సంవృద్ధిని అందిస్తుంది.

మీ ఇంటి ప్లాన్ల్లో ఎందుకు వాస్తును పరిగణనలోకి తీసుకోవాలి?

మీరు మీ ఇంటిని రోజువారీగా లేదా నెలవారీగా నిర్మించుకోలేరు, ఎందుకంటే ఇది ఒక్కసారి చేసే ప్రక్రియ, కొంతమందికి ఇది వారు జీవితంలో ఒకేఒక్కసారి చేసే కార్యక్రమం. మీ కుటుంబం సౌకర్యవంతంగా మరియు సంతోషంగా జీవించాలని ఆశిస్తూ ఒక అందమైన ఇంటిని రూపొందించడం కొరకు మనం చాలా డబ్బును ఖర్చు పెడతాం. ఒక వ్యక్తి జీవితంలో సంతోషం అనేది అంతర్గత మరియు బాహ్య అంశాలతో ముడిపడి ఉంటుంది. సూర్యకాంతి, కాలుష్యం లేని గాలి వంటి బాహ్య కారకాలు  మీ దేహంలోని సప్తచక్రాలను క్రియాత్మకం చేయడం కొరకు అవసరమైన శక్తిని అందిస్తాయి.

 

మీ ఇంటిలోనికి సానుకూల శక్తి నిరంతరం ప్రవహించే విధంగాను మరియు వ్యతిరేక శక్తిని ఉత్పత్తి చేసే కారకాలను ఇంటి నుంచి పారదోలే విధంగా, మీరు మీ ఇంటిని రూపొందించాల్సి ఉంటుంది. సానుకూల శక్తి ప్రవాహం సాధించడం కొరకు మన ప్రాచీన వాస్తు శాస్త్రం అనేక సూత్రాలను పేర్కొంది.

ప్లాట్ యొక్క సైజు మరియు దిక్కు, యజమాని యొక్క పుట్టిన తేదీ మరియు లింగంతో సహా వివిధ వ్యక్తిగత వివరాలను ఉపయోగించడం వల్ల సరళవాస్తు అనేది వాస్తుశాస్త్రం యొక్క ఒక మెరుగైవెర్షన్‌గా చెప్పవచ్చు.

సరళవాస్తు ప్లాన్‌లు– సరళ్ వాస్తు సూత్రాల ఆధారంగా  వివిధ రకాల గృహాల నమూనాలకు మా నిపుణులు తమ  విస్తృతమైన అనుభవం తో అనేక సంవత్సరాలుగా వాస్తు అనుగుణమైన హౌస్ ప్లన్స్ రూపొందిస్తున్నారు.ఈ నిపుణులు వాస్తు శాస్త్ర  విద్వాంసలు మరియు వారు సరళవాస్తు‌కు సంబంధించిన తమ జ్ఞానాని ఉపయోగించి వాస్తుపరంగా అత్యంత సమర్థవంతమైన ఇళ్లను సృష్టించడం కొరకు డిజైన్‌లు రూపొందిస్తారు.

సరళవాస్తు ప్లాన్లను ఎప్పుడు ఉపయోగించాలి?

కొన్నిరకాల ప్లాట్‌లు వారి పుట్టిన తేదీ ఆధారంగా కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఉంటాయి కనుక, ప్లాట్‌ని కొనుగోలు చేసే సమయంలో సరళవాస్తును సంప్రదించాలిసిన అవసరం  ఉన్నది.

ఒక ఖాళీ ప్రదేశంలో ఇంటిని నిర్మించే సమయంలో సరళవాస్తు ప్లాన్‌లను పాటించాలి. అదే సమయంలో కస్టమర్ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాస్తు అనుకూలమైన ఇళ్లను సృష్టించడంలో మా నిపుణులకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది.

సరళవాస్తు ప్లాన్లను ఉపయోగించడంలో ఉండే ప్రయోజనాలు ఏమిటి?

సరళవాస్తు ద్వారా ఇవ్వబడిన ప్లాన్లు, వాస్తు అనుకూలమైన లేవుట్పై దృష్టి సారిస్తుంది, దీని వల్ల ప్రతివ్యక్తికి ప్రయోజనం కలుగుతుంది. సరళవాస్తు ప్లాన్ల ఆధారంగా రూపొందించబడే అన్ని ఇల్లు కూడా జీవించడానికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా ఇంటిలో ఉండేవారికి సానుకూలశక్తిని, మంచి ఆరోగ్యం, సంవృద్ధి మరియు సంపదను అందిస్తుంది.