ప్రధాన ద్వారం దిక్కును ఎలా తనిఖీ చేయాలి?

అనుకూలమైన దిశలు

ఒక వ్యక్తి పుట్టిన రోజు ఆధారంగా ‘అనుకూలమైన’ లేదా ‘అననుకూల’ దిశలు నిర్ణయించబడతాయి. ప్రతి వ్యక్తికి నాలుగు అనుకూల దిశలు మరియు నాలుగు అననుకూల దిశలుంటాయి. ఒక వ్యక్తికి ఉత్తరం లేదా తూర్పు దిశలు అనుకూలంగా ఉన్నట్లయితే, ఈ దిశల్లో ఉండే ఇళ్లు లేదా కార్యాలయాల ద్వారా సంపదను పొందే అవకాశం ఉంది.

సరళ వాస్తు ఛార్టు, మీ పుట్టిన రోజు ఆధారంగా మీకు అనుకూలమైన దిశల్ని అందిస్తుంది. మీ ఇల్లు లేదా పనిప్రాంతపు ప్రధాన ద్వారం అనుకూల దిశలో లేనట్లయితే, మీరు ఆరోగ్యం, సంపద, సంవృద్ధి, సంబంధాలు మరియు పేరుప్రఖ్యాతులు ఇలా అన్నింటిని కోల్పోతారు. ప్రధాన ద్వారం రెండు, మూడు మరియు నాలుగో అననుకూల దిశలో ఉన్నా కూడా, అది చెడ్డ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో నష్టం రావడం, కుటుంబ సమస్యలు , కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య సమస్యలు వంటి అనేక వ్యతిరేక ప్రభావాలకు దారితీస్తుంది.

అయితే, శుభవార్త ఏమిటంటే, సరళవాస్తులో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంది. ఇది అన్ని రకాల సమస్యలకు వాస్తవిక, సార్వత్రిక పరిష్కారం. ప్రధాన ద్వారం తిరిగి నిర్మించడం వంటి నిర్మాణపరమైన మార్పులు అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న మార్పుల ద్వారానే సరళవాస్తు పరిష్కారాలను సాధించవచ్చు. సరళవాస్తును సరిగ్గా అమలు చేయడం ద్వారా, ఇంటిలోను మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యతిరేక శక్తిని తగ్గించబడుతుంది. సానుకూల శక్తి పెంపొందించబడుతుంది, ఫలితంగా వాస్తు దోషాల వ్యతిరేక ప్రభావాలు అధిగమించబడతాయి.